పాకిస్తాన్ క్రికెట్ జట్టు మళ్లీ విమర్శలపాలైంది. ఈసారి కారణం ఆ జట్టు కొత్త జెర్సీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు కొత్త జెర్సీతో దర్శనమిచ్చారు. అయితే ఈ కొత్త జెర్సీని చూసిన అభిమానులు ఇది పాకిస్తాన్ జట్టు కోసమా లేక ఐర్లాండ్ జట్టు జెర్సీనా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. 8 జట్లు పాల్గొనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రత్యేక టోర్నమెంట్ కోసం మరో 6 జట్లు పాకిస్తాన్ వెళ్తున్నాయి. దీంతో పాకిస్తాన్ జట్టు అద్భుతంగా టోర్నమెంట్‌ను నిర్వహించాలని, స్వదేశంలో టైటిల్‌ను గెలుచుకోవాలని కూడా పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే ఆటగాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
శుక్రవారం (ఫిబ్రవరి 7,) లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ కొత్త జెర్సీని ఎంతో ఆర్భాటంగా ఆవిష్కరించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన 15 మంది ఆటగాళ్లందరూ కొత్త జెర్సీలు ధరించి వేదికపై ఫొటోలకు పోజులు ఇచ్చారు. అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే కొంతమంది అభిమానులు పాక్ క్రికెట్ జట్టును ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇది పాకిస్తాన్ జట్టునా లేదా ఐరిష్ జట్టునా అని కామెంట్స్ పెట్టారు.
ఇవి కూడా చదవండి
Presenting Pakistan team’s authoritative jersey for the ICC Champions Trophy 2025 🇵🇰🌟
Order present astatine https://t.co/TWU32Ta9wL 🛒#ChampionsTrophy | #WeHaveWeWill pic.twitter.com/iXZH4TVKqf
— Pakistan Cricket (@TheRealPCB) February 7, 2025
కాగా ఐర్లాండ్ జట్టు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి జెర్సీ తోనే ఆడుతోంది. లేత ఆకుపచ్చ రంగులో ఉంటే షర్ట్, ముదురు ఆకుపచ్చ లేదా నీలం రంగులో ప్యాంటు ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కొత్త జెర్సీ కూడా అలాగే కనిపిస్తోంది. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీ ధర విషయానికొస్తే, అది టీం ఇండియా కొత్త వన్డే జెర్సీ కంటే చాలా చౌక. భారత జట్టు వన్డే జెర్సీని కొంతకాలం క్రితం విడుదల చేశారు, దీనిని ప్రసిద్ధ జర్మన్ క్రీడా దుస్తుల సంస్థ అడిడాస్ రూపొందించింది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే సమయంలో మాత్రమే టీం ఇండియా దీనిని ధరిస్తుంది. భారత జెర్సీ ధర రూ. 5999 అయితే, పాకిస్తానీ జెర్సీ ధర కేవలం 40 అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 3500. అయితే, పాకిస్తాన్ కరెన్సీలో దీని ధర 11 వేలకు పైగా ఉంది. ఇప్పుడు అభిమానుల స్పందన తర్వాత, పాకిస్తాన్ అభిమానులు అంత ఖరీదైన జెర్సీని కొంటారా లేదా అనే సందేహం రావడం సహజం
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..