Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! హీరో ఎవరో తెలుసా.?

2 hours ago 1

సినీ ప్రపంచంలో తిరుగులేని హీరోగా.. తరిగి పోనీ క్రేజ్‌తో దూసుకుపోతున్నారు మెగా స్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా ఎదిగారు. చిరంజీవి చేయని పాత్ర లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించారు చిరు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అలాగే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఇది కూడా చదవండి : Unstoppable with NBK: బాలయ్య షోకి హాజరుకానున్న స్టార్ హీరోయిన్.. అభిమానులు ఫుల్ ఖుష్

అయితే మెగాస్టార్ కు ఒక కొడుకు, ఇద్దరూ కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే.. పెద్ద కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత నిర్మాతగా మారిపోయింది సుస్మిత. ఇక చిన్న కూతురు శ్రీజ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా సినిమా చేసిందన్న విషయం చాలా మందికి తెలియకపోవొచ్చు.

ఇది కూడా చదవండి : Puri Jagannadh: అమ్మబాబోయ్..! పూరీజన్నాథ్ కూతురు ఎంతలా మారిపోయిందో.!

సుస్మిత కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అయితే.. చిరంజీవి సుస్మితను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్నారు. అయితే ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలనుకున్న ప్రతీ సారి ఎదో ఒక ఆటంకం ఎదురవుతుందట. దాంతో చిరంజీవి ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నారట. అయితే లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోగా సుస్మిత హీరోయిన్‌గా పెట్టి ఓ సినిమాను మొదలు పెట్టారట. అలాగే ఈ సినిమాకు పూరిజగన్నాథ్ దర్శకత్వం కూడా వహించారట. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ సినిమా విడుదల కాలేదట. అయితే ఆ సినిమా ఫస్ట్ ఆఫ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సెకండ్ ఆఫ్ షూటింగ్ పూర్తి చేసేలోగా సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ,మరి ఈ విషయంలో నిజమెంతో ఏంటో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే సుస్మిత హీరోయిన్ గా చేసి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉంటుంది అని అంటున్నారు మెగా అభిమానులు.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

Happy day Dad!! Thank you for everything, The life, endless Love, memories, guidance and the safest spot to beryllium myself. Love you truthful overmuch @KChiruTweets pic.twitter.com/MsSP5yunWE

— Sushmita Konidela (@sushkonidela) August 22, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article