కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం గుండెకు మంచిది. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత కీలకం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం అస్సలు మంచిది కాదు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఉదయాన్నే కొన్ని అలవాట్లు అలవర్చుకోవడం వల్ల శరీరంలో పెను మార్పు వస్తుంది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఏమి తింటాం, ఎలా కదులుతాం, మానసికంగా రోజును ఎలా ప్రారంభిస్తాం అనేవి శరీరాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. వీటిల్లో కొన్ని పాటి మార్పులు చేయడం వల్ల కాలక్రమేణా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే 6 ఉదయం అలవాట్లు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మార్నింగ్ వాక్
వారానికి 7 రోజులలో కనీసం 5 రోజులు కనీసం 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేయాలి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, ఊబకాయం సమస్యను మెరుగుపరచడానికి ఎవరైనా ఈ మార్నింగ్ వాక్ చేయవచ్చు.
సంతృప్త కొవ్వు తీసుకోవడం తగ్గించాలి
అల్పాహారంలో రెడ్ మీట్, అధిక కొవ్వు, పాల ఆహారాలను తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ఈ ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.
ఇవి కూడా చదవండి
ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం తగ్గించాలి
కేకులు, కుకీలు, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరానికి హాని కలిగిస్తాయి. కాబట్టి అటువంటి ఆహారాలను అల్పాహారం నుంచి మినహాయించాలి. ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.
ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకోవడం పెంచాలి
అల్పాహారంలో ఫైబర్-రిచ్ ఫుడ్స్ – ఓట్ మీల్, రాజ్మా, చియా విత్తనాలు, పండ్లు వంటివి చేర్చుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం గింజలను తినాలి
మీ ఉదయం ఆహారంలో బాదం, వాల్‌నట్, అవిసె గింజలను చేర్చుకోవాలి. ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది HDL (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రోజును గోరువెచ్చని నీటితో ప్రారంభించవచ్చు
మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా మీ రోజును ప్రారంభించవచ్చు. మీరు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పైన పేర్కొన్న ఈ అలవాట్లను ఉదయాన్నే అలవర్చుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.