తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేశారు. కేసిఆర్ నిన్ను తొక్కుకుంటూ.. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చి నీకు కుర్చీ లాక్కున్నా.. నువ్వు ఫామ్ హౌజ్ లో పడుకొని ఏం కుట్రలు చేస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా అంటూ ఘాటుగా హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే మొక్కను ఇక తెలంగాణ గడ్డపై మొలవనివ్వనని రేవంత్ రెడ్డి శపథం చేశారు. దమ్ముంటే రా.. అసెంబ్లీలో చర్చ పెడదాం డేట్ నువ్వు చెప్పినా సరే – నన్ను చెప్పమన్నా సరే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ సభ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. సెంటిమెంట్‌గా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు.
అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ సీఎం కేసిఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తొక్కుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి సీఎం కుర్చీ లాక్కున్నా.. ఇక తెలంగాణ గడ్డపై కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఫామ్ హౌజ్ లో పడుకుని ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలుసని అన్నారు. తేదీ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అసెంబ్లీకి రా చర్చ పెడదాం.. దమ్ముంటే అసెంబ్లీ కి రా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.
వీడియో చూడండి…
బిల్లా – రంగ అసెంబ్లీలో చర్చిద్దాం రండి.. అభివృద్ధిని అడ్డుకుని ఎవరైనా కుట్రలు కుతంత్రాలు చేస్తే, జైలులో పెట్టి ఊచలు లెక్క పెట్టిస్తా అంటూ పరోక్షంగా బీఆర్‌ఎస్ ముఖ్యనేతలను హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. అదే రేంజ్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు అడ్డుపడ్డ మోదీకి ఊడిగం చేస్తున్న కిషన్ రెడ్డి, గుజరాత్‌కు గులాంగిరి చేస్తున్నాడని ఆరోపించారు. తట్టా బుట్టా సర్దుకుని గుజరాత్‌కి వెళ్లి గులాంగిరి చేసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పదినెలల్లో 22లక్షల రైతు కుటుంబాలకు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు సీఎం. ఆనాడు భద్రకాళీ, సమ్మక్క సారక్క అమ్మవార్ల సాక్షిగా చెప్పా.. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని.. మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నామన్నారు. ఓరుగల్లు వేదికగా మాట ఇస్తున్నా.. మిగిలిన అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మాట ఇస్తే తల తెగిపడినా మడమ తిప్పని నైజం కాంగ్రెస్ ది అని పునర్ఘాటించారు. రాష్ట్రంలో 66 లక్షల 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు. దేశంలో ఎక్కడా ఇంత వరకు ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో వరి ధాన్యం పండిచలేదని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…