మొక్కజొన్న అంటే దాదాపు అందరికీ ఇష్టం. వీటిని కాల్చుకుని, ఉడికించుకుని తింటుంటారు..మొక్కజొన్న గింజలతో పాప్‌కార్న్ తయారు చేస్తారు. ఇది కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. చలికాలంలో కాల్చిన లేదంటే, వేయించిన మొక్కజొన్నలో నిమ్మరసం, మసాలాలు కలిపి తింటే ఆ ఆనందమే వేరు. మొక్కజొన్న పిండితో రొట్టెలు తయారు చేసుకుని కూడా తింటుంటారు. ఎలా తిన్నా కూడా మొక్కజొన్న ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మొక్కజొన్నలాగే దీని మొదట్లో ఉండే జుట్టు మొక్కజొన్న పీచు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా..? . ఇది చదవడానికి మీకు వింతగా అనిపించవచ్చు, కానీ మొక్కజొన్నలా, దాని జుట్టు కూడా తింటారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొక్కజొన్నలో మనకు అవసరమైన పొటాషియం, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అనేక ఖనిజాలు ఉన్నాయి. మొక్కజొన్న వెంట్రుకలను ఉడికించి దాని నీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మొక్కజొన్న వెంట్రుకలు ఉడికించి తయారు చేసిన నీరు తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉండే నైట్రేట్లు, టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఇబ్బందిపెడుతూ ఉంటే, మొక్కజొన్న పీచు మరిగించి ఆ నీటిని తీసుకోవడం ద్వారా రాళ్ల సమస్య కూడా తొలగిపోతుంది.
ఇవి కూడా చదవండి
మొక్కజొన్న పీచు నుండి తయారు చేసిన నీరు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. దీని వినియోగం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే మినరల్స్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మొక్కజొన్న జుట్టు నుండి వచ్చే నీరు మధుమేహంలో కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీని వినియోగం రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మొక్కజొన్న జుట్టులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల దీని వినియోగం శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలో మంట కారణంగా, మీరు ఏకకాలంలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగి ఉండవచ్చు. కానీ రోజూ మొక్కజొన్న పీచు నీటిని తాగితే శరీరంలో వాపు తగ్గుతుంది.
మీరు బరువు తగ్గాలనుకుంటే మొక్కజొన్న జుట్టుతో తయారు చేసిన నీరు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని వినియోగం శరీరంలో ఇన్ఫ్లమేషన్, వాటర్ రిటెన్షన్ సమస్యను నయం చేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్, అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఇది కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.
మొక్కజొన్న పీచులో పొటాషియం, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అనేక మినరల్స్ ఉంటాయి. దీని వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..