ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభ ట్రెండ్స్‌లో, భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ కేవలం 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఉదయం 10 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం, బీజేపీ 43 స్థానాల్లో, ఆప్ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 36 సీట్లు అవసరం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్‌ను బీజేపీ దాటేసినట్లు కనిపిస్తుంది. అయితే తుది ఫలితాల ఏ విధంగా ఉంటాయన్నదీ ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పేలవమైన పనితీరుపై ప్రతిపక్ష వర్గాల మధ్య మేధోమథనం తీవ్రమైంది. ఇండియా అలయన్స్‌లో ముఖ్యమైన భాగస్వామి అయిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ ఫలితాలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ను పంచుకున్నారు. గతంలో ట్విట్టర్‌లో ఉండే X లో ఒక gif ని షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా, “మీలో మీరు మరింత పోరాడండి” అని రాశారు. దీని ద్వారా, ఎన్నికల సమయంలో ఇండియా అలయన్స్‌లో స్పష్టంగా కనిపించిన విభేదాలపై ఆయన వ్యంగ్య వ్యాఖ్య చేశారు. ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణ ఫలితాలు చూస్తారంటూ ఒమర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీ ఫలితాలపై స్పందిస్తూ.. రామాయణం వీడియోని షేర్ చేశారు ఒమర్ అబ్దుల్లా..
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..