మత్స్యకారులకు సముద్రమే జీవనాధారం.. సముద్రంలో వేటకు వెళ్లి వలకు చిక్కిన చేపలను అమ్మి వచ్చిన డబ్బులతో ఆ పూట గడిపేస్తారు.. సముద్రంలో వారికి జీవితాంతం అవినాభావ సంబంధం ఉంటుంది.. అలా ప్రతిరోజు వెళ్తున్న ఆ మత్స్యకారులకు.. కేవలం చేపలే కాదు వలకు వివిధ రకాల సముద్ర జీవులు చిక్కుతూ ఉంటాయి. చేపల వరకు అయితే ఓకే.. మిగిలిన ఏవైనా సరే వాటిని తిరిగి సముద్రంలో పడేస్తుంటారు. అలా కాకుండా కొన్ని చేపలతో పాటు ఒడ్డుకు వలలో వచ్చేస్తూ ఉంటాయి. విశాఖలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చేపలతో పాటు వింత ఆకారంతో ఉండే ఆ సముద్ర జీవులు చిక్కాయి.
సముద్రం లోపల వివిధ రకాల జీవులు జీవనం సాగిస్తూ ఉంటాయి. సాధారణ చేపలు, ప్రత్యేకంగా ఉండే షార్క్ లు, తిమింగిలాలు, డాల్ఫిన్, సముద్ర సర్పాలు, మొసళ్లు ఇలా ఒకటి కాదు సముద్ర గర్భంలో ఆధారపడి ఎన్నో రకాల జీవులు జీవిస్తూ ఉంటాయి. మత్స్యకారులు.. చేపల కోసం వేటకు వెళ్లి వల విసిరితే కేవలం చేపలే కాదు సముద్రాన్ని ఆవాసంగా చేసుకొని జీవించి కొన్ని రకాల జీవులు కూడా చిక్కుతూ ఉంటాయి. కొన్ని సార్లు చేపలతో పాటు, సముద్ర సర్పాలు వస్తే.. మరికొన్ని సార్లు.. షార్క్ లు కూడా వలలో చిక్కుకుంటాయి. అయితే.. విశాఖలో ఈ మధ్యకాలంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడికి వలకు అక్టోపస్లు చిక్కాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు..! వలలో చేపలు పడ్డాయని సముద్రం లోపల నుంచి తీరానికి చేరుకున్నాడు ఆ మత్స్యకారుడు. తీరా వలలో చేపలన్నీ వేరే చేసే సమయంలో చూస్తే ఆక్టోపస్‌లు కనిపించాయి. సముద్రంలో సంచరించే జీవుల్లో అదొకటని వాళ్లు గుర్తించినా.. వలలో చేపలతో పాటు వచ్చినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరిగి వాటిని నీటిలో పడేశారు.
వాస్తవానికి ఆక్టోపస్ అనేది మొలస్కా జాతికి చెందిన జీవులు. సేవలోపోడా అనే శాస్త్రీయ నామం కూడా ఉంది. సముద్రాన్ని ఆవాసంగా చేసుకొని వివిధ ప్రాంతాల్లో ఈ జీవులు నివసిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 జాతుల వరకు ఈ ఆక్టోపస్లు ఉన్నాయని ఒక అంచనా. పరిస్థితి పరిశ్రమలకు అనుసరించి శరీర రంగును కూడా మార్చే స్వభావం కలిగి కొన్ని రకాల అక్టోపస్లు ఉంటాయి. తనకు తాను శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ఒక రకమైన ద్రవం కూడా చెబుతుందని మత్స్య పరిశోధకులు అంటున్నారు. వెన్నెముక లేని తెలివైన సముద్ర జీవుల్లో ఆక్టోపస్ ఒకటి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి