ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది.. 27 ఏళ్ల తర్వాత తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లలో ముందంజలో ఉండగా.. ఆప్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.. దీంతో కాషాయ పార్టీ సంబరాలు అంబరాన్నంటాయి.. ఢిల్లీలో ఫలితాలు, బీజేపీ ఘన విజయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
Kishan Reddy
Updated on: Feb 08, 2025 | 4:05 PM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది.. 27 ఏళ్ల తర్వాత తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లలో ముందంజలో ఉండగా.. ఆప్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.. దీంతో కాషాయ పార్టీ సంబరాలు అంబరాన్నంటాయి.. ఢిల్లీలో ఫలితాలు, బీజేపీ ఘన విజయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. లిక్కర్ స్కామ్‌కు పాల్పడిన వారిని ప్రజలు ఓడించారన్నారు. తెలంగాణ ప్రజల తరపున ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్కడికే పరిమితం కాలేదన్నారు. ఈ స్కామ్ తెలంగాణ వరకు వచ్చిందంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ ఘన విజయం సాధించిందని.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడుతుందని.. ఢిల్లీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో బీజేపీ విజయంపై ప్రధాని మోదీ, జేపీ నడ్డాకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
వీడియో చూడండి..
మోదీ నాయకత్వంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలుస్తున్నాం.. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని కిషన్‌రెడ్డి వివరించారు. రాజకుమారుడిగా శీష్ మహల్‌లో ఉన్న కేజ్రీవాల్‌ను.. ప్రజలు ఇంటికి సాగనంపారన్నారు. తెలంగాణ ప్రజల తరపున ఢిల్లీ ప్రజలకు అభినందనలు.. అంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..