Virat Kohli Cuttack ODI India England: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరీస్‌లో భాగంగా రెండో వన్డే మ్యాచ్ కటక్‌లోని బారాబాటి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగమనం దాదాపు ఖాయం. కానీ, ఇప్పుడు విరాట్ కోహ్లీ పునరాగమనంపై పెద్ద సంక్షోభం నెలకొంది. దీనివల్ల అతను ఈ మైదానంలో బ్యాట్‌తో విఫలం కావొచ్చు. ఎందుకంటే, కటక్ మైదానంలో విరాట్ కోహ్లీ బ్యాట్ బాగా రాణించలేదు. గణాంకాలు చూస్తే కోహ్లీ కాసింత ఆలోచించాల్సిందే.
కటక్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే , 2008లో వన్డేల్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి, ఇప్పటివరకు అతను ఈ మైదానంలో నాలుగు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో మొత్తం 118 పరుగులు విరాట్ కోహ్లీ పేరిట నమోదయ్యాయి. అయితే, అత్యధిక ఇన్నింగ్స్ 85 పరుగులు మాత్రమే. అంటే, కోహ్లీ ఇంకా ఈ మైదానంలో సెంచరీ చేయలేకపోయాడు. ఇది కాకుండా, ఈ మైదానంలో కోహ్లీ వన్డే సగటు 29.50. కోహ్లీ తన చివరి వన్డే మ్యాచ్‌ను 2019లో కటక్ మైదానంలో వెస్టిండీస్‌తో ఆడాడు. అందులో అతను 85 పరుగులు చేశాడు. ఇప్పుడు కోహ్లీ తిరిగి వస్తే, కటక్‌లో తన ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకోవాలనుకుంటాడు.
కోహ్లీ ఎంట్రీతో ఎవరు ఔట్ అవుతారు?
విరాట్ కోహ్లీ టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ లోకి వస్తే , చివరి నాగ్‌పూర్ వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ జట్టుకు దూరంగా ఉండవచ్చు. తన వన్డే అరంగేట్రంలో జైస్వాల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. శ్రేయాస్ అయ్యర్ 59 పరుగులు చేసి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఫిబ్రవరి 9న భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డే మ్యాచ్‌లో ఇప్పుడు అభిమానులందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..