Devara Movie: ఈ అమ్మాయి ఏంట్రా ఇంత క్యూట్‏గా ఉంది.. ‘దేవర’లో సైఫ్ భార్య మైండ్ బ్లాంక్ చేస్తోందిగా..

7 hours ago 2

ఇటీవలే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా దేవర. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు. అలాగే శ్రీకాంత్ కీలకపాత్రలో నటించాడు. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇందులో ద్విపాత్రాభినయంతో మరోసారి యాక్టింగ్ అదరగొట్టారు తారక్. తండ్రి కొడుకుల పాత్రలలో తనదైన నటనతో మరోసారి అడియన్స్ ను మెప్పించాడు. అయితే ఈ సినిమాలో కనిపించిన పలువురు తారలు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన శ్రుతి మరాఠే గురించి నెట్టింట ఆరా తీస్తున్న నెటిజన్స్.. ఇప్పుడు సైఫ్ భార్యగా నటించిన అమ్మాయి ఎవరా అంటూ సెర్చింగ్ స్టార్ట్ చేశారు.

దేవర సినిమాలో సైఫ్ భార్యగా నటించిన అమ్మాయి మరెవరో కాదు.. బుల్లితెరపై చాలా ఫేమస్ నటి అయిన చైత్ర రాయ్. కన్నడ, తెలుగు భాషల్లో అనేక సీరియల్స్ చేసి చాలా ఫేమస్ అయ్యింది. ఈ మూవీతో క్రేజ్ పెరిగితే.. స్మాల్ స్క్రీన్‌కి స్వస్తి చెప్పి.. సిల్వర్ స్క్రీన్‌పై ఫిక్స్ అయిపోవడం ఖాయం అంటున్నారు. అష్టా చెమ్మా సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది చైత్రరాయ్. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసిన చైత్రా.. ప్రస్తుతం రాధకు నీవేరా ప్రాణం అనే సీరియల్ చేస్తుంది.

ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

కన్నడలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ తెలుగు సీరియల్స్ ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అష్టాచెమ్మా, దటీజ్ మహాలక్ష్మి, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్స్ ద్వారా అలరించింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తాజాగా చైత్రరాయ్ సోషల్ మీడియా పోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article