ఆర్ఆర్ఆర్ తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర తో అభిమానుల ముందుకు వచ్చాడు. గతంలో తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన కొరటాల శివ ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అలాగే మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. అభిమానుల భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న విడుదలైన దేవర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రికార్డు స్థాయి వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్ గా దేవర సినిమాకు రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ ఇతర భాషల్లోనూ ఎన్టీఆర్ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల దేవర సినిమా థియేటర్లలో రన్ అవుతోంది. అయితే ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దేవర సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 8 నుంచి దేవరను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కానుందన్నమాట. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లోనూ దేవర సినిమా అందుబాటులోకి రానుంది.
ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి. శ్రుతి మరాఠే, తాళ్లూరి రామేశ్వరి, శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, అజయ్ తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరాలు, బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. కాగా దేవర సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇది వరకే అనౌన్స్ చేశారు మేకర్స్. త్వరలోనే ఇది కూడా పట్టాలెక్కనుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్..
Devara unnantha varaku ee konda meedhi aayana maate! ⚔️ 🌊 Watch Devara connected Netflix, retired 8 November successful Telugu, Tamil, Malayalam and Kannada. Coming soon successful Hindi.#DevaraOnNetflix pic.twitter.com/nRmZStyuar
— Netflix India South (@Netflix_INSouth) November 6, 2024
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Apudapudu dhairyaniki thelidhu avasaraniki minchi thanu undakoodadhu ani… appudu bhayaniki theliyali, thanu ravalsina samayam ochindhi ani. Osthunnadu 🌊🐅 Watch Devara connected Netflix, connected 8 November successful Telugu, Tamil, Malayalam and Kannada. Coming soon successful Hindi.#DevaraOnNetflix pic.twitter.com/8cBzZVqv0i
— Netflix India South (@Netflix_INSouth) November 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.