భారీ భూకంపం కరేబియన్ సముద్రాన్ని వణికించేసింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, కోస్టారికా హోండురస్,నికరగువ, క్యూబా దేశాలపై పడింది. భూకంప తీవ్రతతో సునామీ వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. హోండురాస్ ఉత్తర ప్రాంతంలో శనివారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని, మొదట భూకంప తీవ్రత 6.89గా అంచనా వేసిన తర్వాత GFZ తెలిపింది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక వచ్చిందని అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.
ఉత్తర అమెరికాలోని కరేబియన్ సముద్ర తీరంలో ఉన్న దేశాలలో బలమైన భూకంపం సంభవించింది. మెక్సికో, హోండురాస్‌తో సహా అనేక దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ చేయశారు. US జియోలాజికల్ సర్వే (USGS) భూకంప తీవ్రత 7.6గా నమోదైనట్లు పేర్కొంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని తెలిపింది. అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ మొదట్లో క్యూబాకు 3 మీటర్ల వరకు హోండురాస్, కేమన్ దీవులకు 0.3, 1 మీటర్ మధ్య అలలు ఎగసిపడతాయని అంచనా వేసింది. కానీ తరువాత ముప్పు దాటిపోయిందని తెలిపింది.
భూకంపం తరువాత US సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్యూర్టో రికో మరియు వర్జిన్ దీవులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ తరువాత దానిని రద్దు చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరిగిందానిపై ఎలాంటి స్పష్టతలేదు. 2021లో హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత, ఈ ప్రాంతంలో అతి పెద్ద భూకంపం ఇదేనని అమెరికా జాతీయ మహాసముద్ర, వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..