దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగాలకు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఒకట్రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. మిథున రాశి వారి ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. అలాగే ఆశించిన శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశముంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా చక్కబడతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ధనపరంగా ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా చక్కబడతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. కొన్ని వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు బాగా తగ్గిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలావరకు బయటపడతారు. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందు తుంది. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది. కొద్దిగా ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొద్దిపాటి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ప్రయాణాల వల్ల కొద్దిగా లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉనద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యాపారాలు చాలావరకు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయం సంతృప్తికరంగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులు ఊహించని ఆఫర్లు పొందడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన దైవ దర్శనాలు చేసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రా భరణాలు కొనుగోలు చేస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఇష్టమైన మిత్రులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా బాగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఆరో గ్యానికి ఢోకా ఉండదు. ఉద్యోగంలో పనిభారం కొద్దిగా పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను అందుకుంటారు. అవస రానికి చేతికి డబ్బు అందుతుంది. ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే మంచి సంస్థలో ఉద్యోగం లభించవచ్చు. పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు రాజీమార్గంలో పరిష్కారమ వుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశముంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పనిభారం ఉన్నప్పటికీ, బాగా ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో కొద్దిగా మార్పులు చేపడతారు. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. . చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. పిల్లలు చదు వుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సరికొత్త అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయ త్నాలు బాగా సానుకూలపడతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుని సరదాగా గడుపుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరు గుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో అనుకోకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి శుభ వార్త వింటారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
రోజంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా చక్కబెడతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.