సెకెండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా.? రాచకొండ పోలీస్ కీలక ప్రకటన చేశారు. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వీధులలో వదిలేసిన వివిధ రకాలైన 152 ద్విచక్ర వాహనాలు సెక్షన్ 39బీ సిటీ పోలీస్ యాక్ట్, ఆర్/డబ్ల్యూ యాక్ట్ 7 ఆఫ్ సైబరాబాద్/రాచకొండ అండ్ సెక్షన్ 40 & 41 ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348-ఎఫ్ ప్రకారం అంబర్‌పేట్ రాచకొండ పోలీస్ సిటీ ఆర్మ్స్ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌లో ఫిబ్రవరి 13న బహిరంగ వేలం వేయడానికి నిర్ణయించారు.
ఈ వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నవారు ఫిబ్రవరి 12న CAR HQrts Amberpet Parade Ground నందు DCP CAR HQrts. Rachakonda, Amberpet అనుమతితో వాహనాలను పరిశీలించుకుని ఫిబ్రవరి 13న జరిగే వాహనాల బహిరంగ వేలంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. దీనికి మీరు సంప్రదించాల్సిన నెంబర్లు 8712662661, 8008338535గా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి