దిన ఫలాలు (ఫిబ్రవరి 11, 2025): మేష రాశి వారు ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభించే అవకాశముంది. మిథున రాశి వారి ఆదాయానికి లోటుండదు. అలాగే రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అధికారులతో సానుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడ తాయి. దూరపు బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ప్రతి విషయంలోనూ ఆటంకాలు, ఆలస్యాలు తప్పకపోవచ్చు. అవసర సమయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పనితీరు, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆదాయానికి లోటుండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తి గత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. చదువుల్లో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో సహోద్యోగులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు, తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృథా ఖర్చుల్ని బాగా తగ్గించుకుం టారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ద పెంచడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితంలో కొద్దిగా ఆదరణ పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభి స్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి తీరిక ఉండకపోవచ్చు. వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం బయటపడతాయి. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో హోదాతో పాటు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన లాభాలనిస్తాయి. ఆదాయంలో బాగా వృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరంగా రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలను బాగా పెంచుతారు. సహోద్యోగుల పనిభారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా లాభాలను గడిస్తాయి. ఆదాయం కొద్దిగా పెరిగే సూచనలన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. మిత్రులకు బాగా సహాయపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యు లతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన లాభాలు గడిస్తారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారులుకు లాభం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇష్టమైన బంధువుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. ఎంతో ఉత్సాహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ప్రధానమైన వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది. ఆదా యాన్ని పెంచుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరి స్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆదాయంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణంలో అనుకూలంగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక వాతావరణం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించు కోవడం మంచిది. కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. బంధువుల నుంచి పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.