తెలంగాణలో ఇక చలి యవ్వారం అయిపోయినట్లే. మిస్టర్ సూర్య యాక్షన్‌లోకి దిగాడు. మార్నింగ్, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతల్లో పెద్ద సమస్య లేదు కానీ.. ఉదయం 9 దాటాక సూర్యుడు చెలరేగిపోతున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. దాదాపు 35 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయి. తాజాగా వెదర్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్ బెల్స్ మోగించింది. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో రానున్న 3 నుంచి 5 రోజులు హై రేంజ్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి 19 లేదా 20 వరకు కనీసం 5 రోజుల పాటు గరిష్ఠ ఉష్టోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. తూర్పు, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో 38-40 డిగ్రీల సెల్సియస్ మద్య ఉష్టోగ్రతలు నమోదవవచ్చని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రత 36-38 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉన్నందున తీవ్రమైన వేడి నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మాములుగా మార్చిలో నమోదయ్యే ఉష్టోగ్రతలు ఫిబ్రవరి 2వ వారంలోనే నమోదవ్వడం గమనార్హం. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని పౌరులు ఆందోళణ చెందుతున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా డైట్‌లో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాత్రి కాస్త, మధ్యాహ్నం విపరీతంగా ఎండగా ఉండటంతో.. మార్పులు కారణంగా… చాలా మంది జ్వరం, దగ్గు, జలుబులతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం బాడీలో నీటి శాతం పెంచే తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలన్నది నిపుణులు వెర్షన్. ఇక బయట ఫుడ్ తగ్గించి.. కొబ్బరి నీరు, మజ్జిగ, రాగి జావ వంటివి తరుచుగా తీసుకోవడం బెటర్ అన్నది వారి సూచన.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి