ఎయిమ్స్ రిషికేశ్‌కు చెందిన పీహెచ్‌డీ స్కాలర్ మహిళ దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఒక విధంగా కొత్త జీవితాన్ని పొందారు. 2013లో 38 ఏళ్ల ట్వింకిల్ డోగ్రా విద్యుత్ ప్రమాదానికి గురైంది. మీరట్, ఢిల్లీలో సుదీర్ఘ చికిత్స తర్వాత, ఆమె రెండు చేతులను తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుండి ఆమె కృత్రిమ చేతి సహాయంతో తన పని చేసుకుంటోంది. కానీ ఆమె సహజమైన చేయిని పొందాలనుకుంది. కానీ దాత అందుబాటులో లేరు.
ఇదిలాఉండగా ఒకరోజు, ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి ఆమెతో పరిచయం ఉన్న వైద్యుడి దగ్గరుకు తీసుకెళ్లింది. తన దివంగత భార్య రెండు చేతులను దానం చేయమని కోరాడు. ఈ విషయాన్ని డాక్టర్ మోహిత్ శర్మ ట్వింకిల్ డో, ఆమె భర్త కరణ్ డోగ్రాకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కరణ్, ట్వింకిల్ వైద్యుడిని, రిటైర్డ్ ఆర్మీ అధికారిని కలిశారు. చట్టపరమైన పత్రాలను పూర్తి చేసిన తర్వాత, ఆర్మీ అధికారి 76 ఏళ్ల దివంగత భార్య రెండు చేతులను ట్వింకిల్ డోగ్రాకు అప్పగించారు. దీంతో శస్త్రచికిత్స చేసిన వైద్యులు ట్వింకిల్‌కు రెండు చేతులను జత చేశారు.
ట్వింకిల్ తన చేతులను చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు. 12 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు అన్నీ పనులు సొంత చేతులతోనే చేస్తానని ట్వింకిల్ నవ్వుతూ చెప్పారు. అయితే, చేయి కోల్పోయిన సంఘటన గుర్తుకు వస్తే, ట్వింకిల్ ముఖంలో విచారం కనిపిస్తుంది. “ఈ సంఘటన జరిగినప్పుడు, నా బిడ్డకు కేవలం 10 నెలల వయస్సు మాత్రమే ఉంది. ఒక తల్లిగా నేను నా బిడ్డకు ఆహారం ఇవ్వలేకపోయాను.దానిని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను, కానీ ఇప్పుడు నేను ఈ చేతులతో నా బిడ్డకు ఆహారం పెడతాను” అని ట్వింకిల్ భావోద్వేగానికి లోనయ్యారు.
UGC NET అర్హత సాధించిన ట్వింకిల్, కాస్మెటిక్ హ్యాండ్ ద్వారా తన విద్యాను కొనసాగించారు. ఆమె ఎయిమ్స్ రిషికేశ్ నుండి పిహెచ్‌డి డిగ్రీ పూర్తి చేశారు. ట్వింకిల్ అవయవ మార్పిడి ఫరీదాబాద్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మోహిత్ శర్మ నాయకత్వంలో జరిగింది. ట్వింకిల్ భర్త కరణ్ డోగ్రా ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారి వివాహం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత, జనవరి 6, 2012న, ఆమె బట్టలు ఆరేస్తుండగా, హైటెన్షన్ వైర్ తగిలింది. ఆ తర్వాత రెండు చేతులు కోల్పోయి ఆమె వికలాంగురాలైంది.
మొదట్లో మీరట్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందారు.ఆ తరువాత ఆమెకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు. 20 రోజులు ఆసుపత్రిలో చేరిన తర్వాత, ఆమె రెండు చేతులను తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో చేతి మార్పిడి కోసం దాత కోసం వెతకడం ప్రారంభించారు. చివరికి 12 ఏళ్ల తరువాత దాతలు దొరికారు. ట్వింకిల్ భర్త కరణ్ డోగ్రా తన భార్య చేతి మార్పిడికి సహాయం చేసిన రిటైర్డ్ ఆర్మీ అధికారికి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..