Phani CH |
Updated on: Feb 11, 2025 | 12:48 PM
సమతా కుంభ్ 2025- 108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల రెండో రోజు (11-02-2025) మంగళవారం ఉదయం సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో చినజీయర్‌స్వామి మార్గనిర్దేశంలో అర్చక స్వాములు, రుత్విక్‌లు, వేద విద్యార్థులు, భక్తులు కలిసి ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు. ధ్యాన సమయంలో స్వామివారు అష్టాక్షరీ లఘుజప విధానాన్ని అనుగ్రహించారు.
ధ్యానం తర్వాత ఆరాధన, సేవాకాలం, శాత్తుముఱై పూర్తి చేసుకుని వేద విన్నపాలతో యాగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారు స్వయంగా వచ్చిన భక్తులందరికీ తీర్థాన్ని అనుగ్రహించారు. గరుడ సేవలో వేంచేసిన పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి. 18 మంది పెరుమాళ్లకి ఒకే వేదిక మీద తిరుమంజన సేవలు జరగటం అనేది అరుదు. కేవలం ఈ సమతామూర్తి క్షేత్రంలోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. తిరుమంజనంలో భాగంగా పెరుమాళ్లకు ముందుగా పెరుగుతో స్నానం చేయించారు. తర్వాత పాలు, తేనె, ఫలరసాలు, శుద్ధజలాలతో అభిషేకించారు. తిరుమంజనం తర్వాత నారసింహ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం జరిగింది. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో భక్తులంతా ఉత్సాహంగా నారసింహుని పూజ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఛాట్ జీపీటీ Vs డీప్‌సీక్.. ఇండియా పోటీ పడేదెప్పుడు