అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై కొత్తగా 25 శాతం సుంకాన్ని ప్రకటించిన తర్వాత ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీని కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.2 వేల వరకు పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.88,500కి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం అంటే మంగళవారం అదే పెరిగిన ధరలో కొంత తగ్గి 87,070 వద్ద ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 6 గంటల సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే రూ.99,400 వద్ద ఉంది.
బంగారంలో భారీ పెరుగుదల
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, క్రితం రోజు అంటే సోమవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.88,500కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో అంటే ఆదివారం ఇది రూ.86,070గా ఉంది.
ఫిబ్రవరి 11న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,960 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.87,220 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 వద్ద కొనసాగుతోంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 వద్ద కొనసాగుతోంది.
- ఇక కేరళలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.79,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,070 వద్ద కొనసాగుతోంది.
- ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఎందుకంటే ఇటీవల నుంచి బంగారం పెరుదల భారీగా ఉంటుంది. నిమిషాల్లోని భారీ మార్పులు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి