IPL 2025 Schedule Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 షెడ్యూల్ కు సంబంధించి కీలక వార్తలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ రాబోయే 7 రోజుల్లో షెడ్యూల్ ప్రకటించవచ్చు అని తెలుస్తోంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 21 నుంచి ప్రారంభమవుతుందని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అభిమానులు ఇంకా షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. టోర్నమెంట్ చివరి మ్యాచ్ మే 25న జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంది.
మునుపటి ఎడిషన్ లాగే రాబోయే ఎడిషన్‌లో మొత్తం పది జట్లు పాల్గొంటాయి. ఈ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్.
గత సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించి మూడవ టైటిల్‌ను గెలుచుకుంది. చెన్నై, ముంబై ఇండియన్స్ తర్వాత టోర్నమెంట్ చరిత్రలో మూడవ అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ, రాజస్థాన్ జట్లు బయటే..
తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ సొంత మైదానంలో మ్యాచ్‌లు ఆడలేవని తెలుస్తోంది. ఢిల్లీ తన రెండు హోమ్ మ్యాచ్‌లను వైజాగ్‌లో ఆడగలదు. అయితే రాజస్థాన్ జట్టు తన రెండు హోమ్ మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడవచ్చు అని తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 367 మంది భారతీయులు, 210 మంది విదేశీ క్రికెటర్లు సహా 577 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.
ఈ వేలంలో అత్యంత సంచలనాత్మక క్షణం రిషబ్ పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనుగోలు చేయడంతో, ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇది కాకుండా, 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా మారాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..