బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పశువులకు సంవత్సరానికి ఒకసారి ఈ వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్‌ఎస్‌డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు వివరించాయి.
Lumpy Skin Vaccine
Updated on: Feb 11, 2025 | 12:44 PM
లంపి వైరస్ ఇన్ఫెక్షన్ నుండి పశువులను రక్షించడానికి భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటి దివా మార్కర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన లైసెన్స్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఇటీవల ఆమోదించింది. బయోవెట్ అని పిలువబడే ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సహకారంతో అభివృద్ధి చేసింది. పాడి పశువులకు వచ్చే లంపీ స్కిన్ వ్యాధి నుంచి రక్షించడానికి ఈ టీకా ఇస్తారు. ఎల్‌ఎస్‌డీ వ్యాధితో గత రెండు సంవత్సరాల్లో సుమారు 2 లక్షల పశువులు మృతి చెందాయి. దీంతో భారత్ బయెటెక్ సంస్థ ఈ టీకాను కనిపెట్టింది. ‘బయోలంపివ్యాక్సిన్’ అనే ఈ టీకా మన దేశంలోనే మొదటిది.
ఈ లంపీ చర్మ వ్యాధి పోక్స్విరిడే కుటుంబానికి చెందిన వైరస్ వల్ల పశువులకు సంక్రమించే అంటు వ్యాధి. దీనిని నీత్లింగ్ వైరస్ అని కూడా అంటారు. దీనివల్ల చర్మంపై ఒక ముద్ద ఏర్పడుతుంది. ఈ వైరస్ బారిన పడ్డ పశువులు జ్వరం, శోషరస గ్రంథులు వాపు, పాల ఉత్పత్తి తగ్గడం, కదలడంలో ఇబ్బందితో బాధపడుతుంటాయి. ఈ వైరస్ దోమలు, కీటకాలు, ఇతర కుట్టే కీటకాల ద్వారా వ్యాపిస్తుంది.
ఇవి కూడా చదవండి
బయోవెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, మూడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పశువులకు సంవత్సరానికి ఒకసారి ఈ వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. ఇది మనదేశంలో పశుసంపద అభివృద్ధి, ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన ముందడుగని పేర్కొన్నారు. ఇకపై ఈ టీకా కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ టీకాను పాడి పశువులకు వేయిస్తే, ఎల్‌ఎస్‌డీ వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టి, పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందని బయోవెట్ వర్గాలు వివరించాయి.