మీకు కారు ఉన్నట్లయితే FASTag గురించి తెలుసుకోవాలి. కానీ కేవలం అవగాహన కలిగి ఉండటం సరిపోదు. దీనికి సంబంధించిన నిబంధనలతో మీరు నిరంతరం అప్‌డేట్‌గా ఉండటం ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వం FASTag కు సంబంధించిన నియమాలను తరచుగా మారుస్తూనే ఉంటుంది. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రజల సౌలభ్యం కోసం టోల్ ప్లాజాలలో చెల్లింపు ఎంపికలను సులభతరం చేయడానికి, ఇబ్బంది లేకుండా చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. దేశంలోని 22 రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు కోసం FASTagను తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాహనాలపై ఫాస్ట్‌ట్యాగ్ ఉండటం తప్పనిసరి చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేసినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మినహాయింపులు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి, మహారాష్ట్రలోని అన్ని వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు మినహయింపు ఉన్న రాష్ట్రాల్లో కూడా తప్పనిసరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దరఖాస్తు చేయకపోతే ఎంత జరిమానా:
ఏప్రిల్ 1 నుండి మీ వాహనంలో FASTag లేకపోతే, మీరు జరిమానాగా రెట్టింపు టోల్ రుసుము చెల్లించాలి. దీన్ని నివారించడానికి మీ వాహనంలో సకాలంలో FASTagను ఇన్‌స్టాల్ చేసుకోవడం తప్పనిసరి. ఇతర రాష్ట్రాల వారు మహారాష్ట్రకు వెళ్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకుంటే రెట్టింపు టోల్ వసూలు చేసే అవకాశం ఉంది.
ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏమిటి?:
FASTag అనేది ఒక చిన్న ఎలక్ట్రానిక్ RFID ట్యాగ్. దీనిని కారు డ్రైవర్లు తమ కారు విండ్‌షీల్డ్‌కు అటాచ్ చేసుకుంటారు. ఈ RFID ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగించి వాహన వివరాలను సేకరిస్తుంది. తద్వారా టోల్ ప్లాజా వద్ద ఆగకుండానే చాలా సులభంగా టోల్‌లు చెల్లించవచ్చు. ఇది సమయం, డబ్బు రెండింటినీ ఆదా చేస్తుంది. టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేస్తుంది. పారదర్శకంగా చేస్తుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: ఇంతట్లో ఆగేటట్లు లేదుగా.. పాత రికార్డ్‌లను బద్దలు కొడుతున్న బంగారం ధర!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి