తన మారుతీ స్విఫ్ట్ డిజైర్‌ను నడుపుకుంటూ కోలార్ జిల్లాలో జీవనం సాగిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అర్ధరాత్రి రాకేష్ గౌడ్ మద్యం సేవించాడు. ఫుల్లుగా మందుకొట్టి ఇంటికి వెళ్లాలనుకున్నాడు. ఈక్రమంలోనే తన కారును స్టార్ట్ చేశాడు. కారు.. ముందుగా టేకల్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకు వచ్చింది. ఆపై నేరుగా వెళ్లి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. అర్ధరాత్రి 2 గంటలు కావడం.. ఆ సమయంలో ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువగా ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే రైల్వే ట్రాక్‌పై కారు పడిన సమయంలో కూడా ఆ పట్టాలపై ఎలాంటి రైలూ రాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వెళ్లి అతడిని పైకి తీసుకు రావడంతో.. డ్రైవర్ రాకేష్ గౌడ్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఈ క్రమంలోనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ రాకేష్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రైల్వే అధికారుల సాయంతో ఆ ట్రాక్ వెంట వచ్చే రైళ్లను దారి మళ్లించారు. ఆపై క్రేన్ల సాయంతో ట్రాక్‌పై ఉన్న కారును తొలగించి.. రైళ్ల రాకపోకలు కొనసాగేలా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??
ఆ హీరో చాలా స్పెషల్.. కానీ ఆ విషయమే నచ్చదు..
మహా కుంభమేళాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్..