మూవీ రివ్యూ: తండేల్
నటీనటులు: నాగ చైతన్య, సాయి పల్లవి, కరుణాకరణ్, ప్రకాశ్ బెలావాడి, దివ్య పిళ్లై, పృథ్వీ, కళ్యాణీ నటరాజన్, కల్పలత తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనూద్ధీన్
ఇవి కూడా చదవండి
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
రచన, దర్శకుడు: చందూ మొండేటి
తండేల్.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. నాగ చైతన్య కెరీర్‌లోనే కాదు.. ఈ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందూ మొండేటి. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..
కథ:
ఉత్తరాంధ్రలోని కే మచ్చలేశం అనే తీర ప్రాంతంలో ఉంటాడు రాజు (నాగ చైతన్య). చిన్నప్పటి నుంచి సత్య (సాయి పల్లవి)ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు రాజు. సత్య కూడా అంతే. అయితే చేపలు పట్టడం వృత్తి కావడంతో.. ఏడాదిలో 9 నెలలు సముద్రంలోనే ఉంటాడు రాజు. మిగిలిన 3 నెలలు ఇంటికి వచ్చి తల్లి, సత్యతో హాయిగా ఉంటాడు. రాజు ధైర్యం చూసి అతన్ని తండేల్ చేస్తారు ఊరు జనం. తండేల్ అంటే తన జట్టు కోసం నిలబడే నాయకుడు అన్నమాట. అలా ఓసారి వేటకు వెళ్లిన రాజు, అతడి గ్యాంగ్ పాకిస్తాన్‌కు దొరికిపోతారు. పాక్ కోస్ట్ గార్డ్స్ వాళ్లను అరెస్ట్ చేసి కరాచీ జైల్లో వేస్తారు. పరాయి దేశంలో జైలుపాలైన రాజుతో పాటు మిగిలిన 21 మందిని ఇక్కడ్నుంచి ఎలా సత్య వినిపించింది..? వాళ్ల కోసం ఇక్కడున్న వాళ్లు ఏం చేసారు అనేది తండేల్ కథ..
కథనం:
చాలా రోజులు అయిపోయింది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి.. తండేల్‌తో మొత్తంగా కాదు గాని ఒక మోస్తరుగా ఆ లోటు తీరిపోయింది. 9 నెలలు సముద్రంలో.. 3 నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది. కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కథ మళ్ళీ మళ్ళీ చెప్పడం మూలానో ఏమో కానీ.. సినిమా చూస్తున్నపుడు ఎగ్సైటింగ్ గా అనిపించలేదు. పైగా నెక్ట్స్ ఏం జరుగుతుందో కూడా ముందుగానే తెలిసిపోతుంది. అయితే తెలిసిన కథతోనూ స్క్రీన్ ప్లేతో బాగానే నిలబెట్టాడు. తొలి 45 నిమిషాలు బాగా నెమ్మదిగా కథ సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి.. తండేల్ బాగా స్పీడ్ అందుకుంది. నాగ చైతన్య అండ్ బ్యాచ్ పాకిస్తాన్ కు దొరికిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు దర్శకుడు చందు మొండేటి. హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవిపై వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. చైతు, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమా మొత్తం వీళ్ళ ప్రేమ కథ మీదే వెళ్తుంది. క్లైమాక్స్ అరగంట కథను చాలా మలుపులు తిప్పాడు దర్శకుడు. ఆర్టికల్ 370 ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా వాడుకున్నాడు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉండే రియలిస్టిక్ పరిస్థితులను కథకు సెట్ అయ్యేలా రాసుకున్నారు. కాశ్మీర్ ఇష్యూను కూడా కథలోకి లింక్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాలో ఇండియా, పాక్ కంటే కూడా రాజు, సత్యల మధ్య ప్రేమకథే హైలైట్. దర్శకుడు మొదటి సీన్ నుంచి కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ చేసాడు. వాళ్ల చుట్టూనే కథ రాసుకున్నాడు.. అల్లుకున్నాడు. ఫస్టాఫ్ అంతా చైతూ, పల్లవి మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. కాకపోతే అక్కడక్కడా ల్యాగ్ అనిపిస్తాయి. ఒకే సీన్ మళ్లీ మళ్లీ చూసినట్లు అనిపిస్తుంది. అయితే దేవీ శ్రీ ప్రసాద్ ఎప్పటికప్పుడు తన మ్యూజిక్‌తో ఆ ల్యాగ్ కనబడకుండా జాగ్రత్త పడ్డాడు. సెకండాఫ్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే జైల్ సీన్స్ అన్నీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని రాసుకున్నట్లు అర్థమవుతుంది. క్లైమాక్స్ ఊహించిన దానికంటే బాగా రాసుకున్నాడు దర్శకుడు చందూ మొండేటి. అది సినిమాకు ప్లస్ అవుతుంది.
నటీనటులు:
సాయి పల్లవి ఎప్పటిలాగే మాయ చేసింది. స్లాంగ్ కూడా బాగానే మేనేజ్ చేసింది. నటన పరంగా మాత్రం పేరు పెట్టడానికి ఏం లేదు. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే.. చైతు చాలా సన్నివేశాలు పల్లవిని సైతం డామినేట్ చేశాడు.. కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు.. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టాడు నాగ చైతన్య. దివ్య పిళ్ళై ఓ కీలక పాత్రలో బాగా నటించింది. తమిళ నటుడు కరుణాకరణ్ కూడా ఓ మంచి పాత్ర చేసాడు. పాకిస్తాన్ జైలర్‌గా ప్రకాశ్ బెలావాడి నటన బాగుంది. మిగిలిన వాళ్లు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు..
టెక్నికల్ టీం:
తండేల్ సినిమాకు మెయిన్ హీరో దేవీ శ్రీ ప్రసాద్. ఆయనకు 100 కాదు.. 1000 మార్కులు వేయాలి ఈ సినిమాకు. తండేల్ నిలబడింది అంటే దానికి ప్రధాన కారణం డిఎస్పీ మ్యూజిక్.. ఆయన ఆర్ఆర్. చాలా రోజులు.. కాదు కాదు చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ డ్యూటీ ఎక్కాడు దేవీ. సినిమా అంతా DSP బిజిఎం చెవుల్లో రీ సౌండింగ్ వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బుజ్జితల్లి పాటను సినిమా అంతా వాడుకున్నాడాయన. అలాగే సినిమాటోగ్రఫీ కూడా నీట్‌గా ఉంది. ఎడిటింగ్ షార్ప్‌గానే అనిపిస్తుంది కానీ ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చూసుకుంటే బాగుండేది. గీతా ఆర్ట్స్ ఖర్చుకు వెనకాడలేదు. దర్శకుడు చందూ మొండేటి ఈ కథకు తన వరకు అయినంత న్యాయం చేశాడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా తండేల్.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ..
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన