Updated on: Feb 07, 2025 | 3:20 PM
తండేల్.. కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. నాగ చైతన్య కెరీర్‌లోనే కాదు.. ఈ మధ్య కాలంలో గీతా ఆర్ట్స్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తండేల్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు చందూ మొండేటి. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం..
ఉత్తరాంధ్రలోని కే.మచ్చలేశం అనే తీర ప్రాంతంలో ఉంటాడు రాజు అలియాస్ నాగ చైతన్య. చిన్నప్పటి నుంచి సత్య అలియాస్ సాయి పల్లవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటాడు రాజు. సత్య కూడా అంతే. అయితే చేపలు పట్టడం వృత్తి కావడంతో.. ఏడాదిలో 9 నెలలు సముద్రంలోనే ఉంటాడు రాజు. మిగిలిన 3 నెలలు ఇంటికి వచ్చి తల్లి, సత్యతో హాయిగా ఉంటాడు. రాజు ధైర్యం చూసి అతన్ని తండేల్ చేస్తారు ఊరు జనం. తండేల్ అంటే తన జట్టు కోసం నిలబడే నాయకుడు అన్నమాట. అలా ఓసారి వేటకు వెళ్లిన రాజు, అతడి గ్యాంగ్ పాకిస్తాన్‌కు దొరికిపోతారు. పాక్ కోస్ట్ గార్డ్స్ వాళ్లను అరెస్ట్ చేసి కరాచీ జైల్లో వేస్తారు. పరాయి దేశంలో జైలుపాలైన రాజుతో పాటు మిగిలిన 21 మందిని సత్య ఇక్కడ నుంచి ఎలా విడిపించింది.? వాళ్ల కోసం ఇక్కడున్న వాళ్లు ఏం చేసారు అనేది తండేల్ కథ..
Published on: Feb 07, 2025 03:18 PM