Nani Remuneration: వరుస సినిమాలు, విజయాలతో న్యాచురల్ స్టార్ నాని జోరు కొనసాగిస్తూనే ఉన్నారు. రెండేళ్ళ కింద దసరా, హాయ్ నాన్నతో విజయాలు అందుకున్న నాని.. గతేడాది సరిపోదా శనివారంతో మరో రూ.100 కోట్ల హిట్ సినిమా ఇచ్చాడు. విజయాలే కాదు.. నాని రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు ట్రెండింగే. నాని మళ్ళీ రేట్ పెంచాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో రూ.20 కోట్ల వరకు తీసుకునే నాని.. ఇప్పుడు మరో..
Nani
ఈ రోజుల్లో స్టార్ హీరోలకు ఇస్తున్న రెమ్యునరేషన్ గురించే ఇండియా అంతా మాట్లాడుకుంటోంది. మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ టాప్ హీరోలైతే రూ.100 కాదు రూ.200 కోట్లు కావాలంటున్నారు. మన సినిమాలకు వస్తున్న కలెక్షన్లు కూడా ఆ రేంజ్‌లో ఉన్నాయి. అయితే మీడియం రేంజ్ హీరోలు ఇంకా రూ.10 నుంచి రూ.15 కోట్ల మధ్యలోనే ఉన్నారు. అలాంటిది రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అనేది.. మిడ్ రేంజ్ హీరోలకు ఓ కల..! ఎందుకంటే వాళ్ల సినిమాలు హిట్టైనా అన్ని కోట్లు వస్తాయా అనేది అనుమానమే. పైగా టాలీవుడ్‌లో ఎప్పుడూ ఓ అనుమానం అలాగే ఉంటుంది. మీడియం రేంజ్ హీరోలలో నెంబర్ వన్ ఎవరా అని..? దీనికి సమాధానంగా ఎప్పుడూ నానినే ముందు కనిపిస్తుంటాడు.
వరుస సినిమాలు, విజయాలతో జోరు చూపిస్తూనే ఉంటారు న్యాచురల్ స్టార్ నాని. రెండేళ్ళ కింద దసరా, హాయ్ నాన్నతో విజయాలు అందుకున్న నాని.. గతేడాది సరిపోదా శనివారంతో మరో రూ.100 కోట్ల సినిమా ఇచ్చాడు. విజయాలే కాదు.. నాని రెమ్యునరేషన్ కూడా ట్రెండింగే. నాని మళ్ళీ రేట్ పెంచాడంట.. ఈ లైన్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్. ఇప్పుడూ ఇదే వినిపిస్తుంది. గతేడాది వరకు రూ.25 కోట్లు తీసుకున్న నాని.. ఇప్పుడు మరో రూ.5 కోట్లు పెంచేసారని ప్రచారం జరుగుతుంది. అంటే రూ.25 కోట్ల వరకు అడుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
అంతేకాదు.. DVV ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌజ్ నానికి రూ.50 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారని తెలుస్తుంది. సరిపోదా శనివారం చేస్తున్నపుడే డివివి దానయ్య నిర్మాణంలోనే సుజీత్ సినిమా సైన్ చేసాడు నాని. ఇది కాస్త లేట్ అవుతుందేమో కానీ కచ్చితంగా ఉంటుందని చెప్పాడు న్యాచురల్ స్టార్. ఈ 2 సినిమాలకు కలిపి నాని రూ.50 కోట్లు తీసుకుంటున్నారని చాలా రోజుల కిందే ప్రచారం జరిగింది.. ఇప్పుడిది నిజమే అంటున్నారు. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ప్యారడైజ్ కోసం భారీగానే తీసుకుంటున్నాడు నాని. మొత్తానికి నాని స్థాయి చూసి మిగిలిన మీడియం రేంజ్ హీరోలకు కూడా ధైర్యమైతే వచ్చేసింది.