IPL 2025 5 Key Things: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. IPL 2025 మొదటి మ్యాచ్, చివరి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందనే సమాచారం గతంలోనే వెలువడింది. కానీ, దాని పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే బీసీసీఐ తన షెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తుంది. దీనికి ముందు, ఈ ఐపీఎల్ సీజన్‌లోని 5 ప్రత్యేకమైన విషయాలను తెలుసుకుందాం. అత్యంత ఖరీదైన విదేశీ, భారతీయ ఆటగాడు ఎవరు, వయసులో పెద్ద, చిన్న ఆటగాళ్లు ఎవరు, ఏ జట్లు తమ కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి, ఏ జట్ల కెప్టెన్లను ఇంకా నిర్ణయించలేదు? ఇలాంటి విషయాలను ఓసారి చూద్దాం..
అత్యంత ఖరీదైన విదేశీ-భారతీయ ఆటగాళ్లు ఎవరు?
ఐపీఎల్ 2025 వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో 2025 నవంబర్ 24, 25 తేదీలలో జరిగింది. ఈ కాలంలో, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ. 15.75 కోట్లకు కొనుగోలు చేసింది. అత్యధిక ధరకు అమ్ముడైన భారత ఆటగాడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లోనే కాదు, మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు పంత్.
అత్యంత సీనియర్, జూనియర్ ప్లేయర్లు ఎవరు?
ఐపీఎల్ 2025లో అత్యంత ఖరీదైన ఆటగాడు టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. CSK ఆటగాడు ధోని వయసు 43 సంవత్సరాలు. అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అతనికి 13 సంవత్సరాలు. ఐపీఎల్ 2025 వేలంలో, అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు సంతకం చేసింది.
ఇవి కూడా చదవండి
7 జట్ల కెప్టెన్లు వీరే.. సందిగ్ధంలో 3 జట్లు?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల కెప్టెన్లను ఇంకా నిర్ణయించలేదు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
ఐపీఎల్ 2025 ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభమవుతుంది. కొన్ని రోజుల క్రితం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దాని ప్రారంభ తేదీని ధృవీకరించారు. తొలి మ్యాచ్ మార్చి 21న కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ ఎప్పుడు జరుగుతుంది?
ఐపీఎల్ కొత్త సీజన్‌లో ఫైనల్‌తో సహా మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో పాటు ఐపీఎల్ 2025 ఫైనల్ కూడా మే 25న జరుగుతుంది. సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రెండు ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..