గుమ్మడి గింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడమే కాకుండా కండరాల మరమ్మత్తుకు సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు గుమ్మడికాయ గింజలు మంచివి. గుమ్మడికాయ గింజలు విటమిన్ కె, విటమిన్ ఇ వంటి పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి.
గుండెకు మేలు
గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణక్రియకు సహాయం
గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నివారణకు కూడా ఉపయోగపడుతుంది.
బరువు నియంత్రణ
గుమ్మడి గింజల్లో కేలరీలు ఎక్కువ ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మితంగా తీసుకోవాలి. గుమ్మడి గింజలు 5 గ్రాముల మించి తినకూడదు. వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఎలా తీసుకోవాలి..?
గుమ్మడికాయ గింజలను పచ్చిగా, ఎండబెట్టి, పొడిచేసి వాటిని సలాడ్లో కలిపి తీసుకోవచ్చు. వీటిని వేయించి కూడా తినవచ్చు. ఇకపై గుమ్మడికాయ చెక్కుతున్నప్పుడు లేదా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ గింజల్ని పడేయకండి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఎలా తిన్నా మనకు ఉపయోగమే. గుమ్మడి గింజలు చిన్నవి అయినా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి.