ఈ మధ్యకాలంలో సినిమా బిజినెస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. థియెట్రికల్ మార్కెట్ పోటీగా ఓటీటీ బిజినెస్ కూడా జరుగుతోంది. దీంతో మేకర్స్ కూడా ఓటీటీల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఓటీటీల కోసమే కొంత షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ డిజిటల్ బిజినెస్‌కు మరింత హెల్ప్ అవుతుందంటున్నారు.
Phani CH | Edited By: Shaik Madar Saheb
Updated on: Feb 07, 2025 | 11:40 PM
పాన్ ఇండియా సినిమాల విషయంలో థియెట్రికల్ మార్కెట్‌కు పోటీగా ఓటీటీ మార్కెట్ కూడా పెరుగుతోంది. సినిమా సెట్స్ మీద ఉండగానే ఓటీటీ డీల్స్ సెట్ అయిపోతుండటంతో అందుకు తగ్గట్టుగా మేకింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
1 / 5
ముఖ్యంగా మల్టీ లింగ్యుల్ స్ట్రీమింగ్ కోసం కొన్ని క్లోజప్ షాట్స్‌లో లిప్ సింక్ ఉండేలా రెండు మూడు వర్షన్స్ షూట్ చేసి పెట్టుకుంటున్నారు. ఓటీటీ ప్రమోషన్స్ విషయంలోనూ ముందు నుంచే పక్కా ప్లానింగ్‌తో ఉంటున్నారు మేకర్స్.
2 / 5
షూటింగ్ సమయంలోనే లొకేషన్‌లో స్పెషల్ ప్రోమోస్‌ను షూట్ చేసేస్తున్నారు. డిజిటల్ రిలీజ్ టైమ్‌లో ఆ ప్రోమోస్ సినిమా మీద బజ్ క్రియేట్ చేయటంలో చాలా హెల్ప్ అవుతున్నాయి.
3 / 5
రాజమౌళి లాంటి దర్శకులైతే మరింత పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ టైమ్‌లోనే ఆర్టిస్ట్‌ల బైట్‌లతో పాటు మేకింగ్ వీడియోస్‌ను కూడా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఆ కంటెంట్‌ను కొంత థియెట్రికల్ ప్రమోషన్ కోసం వాడితో, ఇంకొంత డిజిటల్ ప్రమోషన్ కోసం వాడుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రిపులార్ : బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీలో షూటింగ్ టైమ్‌లో షూట్ చేసిన బైట్స్ కూడా చాలానే కనిపించాయి.
4 / 5
భారీ చిత్రాల విషయంలో ఓటీటీ బిజినెస్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుండటంతో స్టార్స్ కూడా డిజిటల్ ప్రమోషన్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముందు ప్లాన్ చేయకపోయినా... డిజిటల్ రిలీజ్ టైమ్‌కు స్పెషల్ వీడియో బైట్స్‌తో ఆడియన్స్‌ను అలర్ట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ సినిమా మార్కెట్‌కు మరింత హెల్ప్ అవుతుందంటున్నారు విశ్లేషకులు.
5 / 5