హైదరాబాద్ మీర్‌పేట్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన మాధవి మర్డర్ కేసులో అసలు నిజం బయటపడింది. గురుమూర్తికి, మాధవికి మధ్య వివాదానికి కారణమైన అంశాన్ని పోలీసులు కోర్టులో ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. జనవరిలో మీర్‌పేట్‌లో చోటు చేసుకున్న దారుణ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు మాధవి గురుమూర్తిని అరెస్టు చేశారు. గురుమూర్తి చేసిన క్రూరమైన చర్యను పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరించారు.
Meerpet Incident
Lakshmi Praneetha Perugu | Edited By: Ram Naramaneni
Updated on: Feb 07, 2025 | 3:25 PM
మీర్‌పేట్‌లో భార్యను చంపి.. ముక్కలు ముక్కలు చేసిన గురుమూర్తి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును TV9 సంపాదించింది. ఈ రిపోర్టులో చాలా స్పష్టంగా వారి ఇద్దరికీ ఉన్న విభేదాల గురించి ప్రస్తావించారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి ప్రస్తుతం DRDOలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. అయితే ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత స్థానికంగా జిల్లెలగూడలో ఆయన నివాసం ఉంటున్నాడు. భార్యభర్తలది ఒకే ఊరు. అయితే సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం గురుమూర్తి కుటుంబానికి… మాధవి కుటుంబానికి తీవ్రస్థాయిలో గొడవలు జరిగాయి. కుటుంబ విషయాలపై ఐదు సంవత్సరాల క్రితం సొంత ఊరిలో పంచాయతీ నిర్వహించారు. పెద్దల సమక్షంలో వీరి పంచాయతీ నడిచింది. ఈ ఘటన తర్వాత గురుమూర్తి మళ్లీ అత్తగారింటికి వెళ్లలేదు. భార్యను వెళ్లనివ్వలేదు.
అయితే జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎప్పుడు గురుమూర్తి ఇంటికే కాకుండా తన ఇంటికి సైతం తీసుకెళ్లాలని మాధవి గురుమూర్తిని పట్టుబట్టింది.. ఇదే విషయంపై జనవరి 15న ఇద్దరికీ తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పండుగకి కూడా తనను ఇంటికి పంపించకపోవడంపై మాధవి గురుమూర్తితో వాగ్వావాదానికి దిగింది. ప్రతిసారి ఏ పండగ వచ్చినా గురుమూర్తి ఇంటికే దంపతులు వెళుతుండేవారు. అయితే సంక్రాంతి పండుగకు ఈసారైనా తనను తన ఇంటికి పంపించాలని మాధవి గురుమూర్తిని కోరింది. దీనికి గురుమూర్తి ఒప్పుకోకపోవడంతో మాధవి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురుమూర్తితో గొడవపడింది. దీనికి స్పందించిన గురుమూర్తి “ఇంత జరిగిన కూడా ఏ మొహం పెట్టుకొని సొంత ఊరికి తీసుకెళ్లమంటున్నవ్ ” అంటూ మాధవిపై ఆవేశంతో ఊగిపోయాడు.
ఈ గొడవ జరుగుతున్న క్రమంలోనే మాధవి గొంతు నలిమి గోడకేసి కొట్టాడు. దీంతో మాధవి స్పాట్లోనే చనిపోయింది. మాధవి చనిపోయినట్లు ఆధారాలు లభించకుండా ఉంటే అందరూ నమ్ముతారు అని భావించిన గురుమూర్తి చనిపోయిన మాధవి మృతదేహన్ని కిచెన్‌లోకి తీసుకువచ్చి ఒక్కొక్క శరీర భాగాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకుంటూ వచ్చాడు. అలా మొత్తం 70 భాగాలుగా శరీరాన్ని కట్ చేశాడు.. ఆ తర్వాత మాధవి కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేయటంతో వారు మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తుంటే అసలు విషయం బయటపడింది. కేసులో గురుమూర్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..