అతడి టార్గెట్ 100 మంది అమ్మాయిలను అనుభవించడం.. అతడి టార్గెట్ ఒకేసారి 3 కోట్ల రూపాయలు కొట్టేయడం.. అతడి టార్గెట్ ఇంజనీరింగ్ కాలేజీలలో డబ్బు కొట్టేయడం.. అతడి టార్గెట్ వైజాగ్ జైల్‌లో ఉన్న ఖైదీని కాల్చి చంపడం.. ఇన్ని టార్గెట్లు పెట్టుకున్న అతడిని సైబరాబాద్ పోలీసులు టార్గెట్ చేశారు. దెబ్బకు అతడి మీద ఉన్న 80 కేసులను పోలీసులు బయటికి తీశారు. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం ప్రిజం పబ్ వద్ద జరిగిన కాల్పుల కేసులో నిందితుడు ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ సర్వేష్ రెడ్డి అలియాస్ హర్ష రెడ్డి అలియాస్ బిట్టు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పేర్లు మార్చుకుంటూ రెండు తుపాకులు క్యారీ చేస్తూ.. నెలకు ఒక చోరీ చేస్తూ హైదరాబాద్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ కథ వింటుంటే సినిమా విల్లన్లు కూడా పనికి రారు అనే రీతిలో ఉంది.
ప్రభాకర్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 పేర్లు మార్చుకుంటూ కోట్ల కొద్ది రూపాయలు కాజేస్తూ హైదరాబాద్ రోడ్లపై షికారు కొడుతూ బిందాస్‌గా బ్రతికేస్తున్నాడు. హైదరాబాద్‌లో నెలకు లక్ష రూపాయల ఇంటి అద్దె చెల్లిస్తూ లగ్జరీ 3BHK ఇంట్లో ఉంటూ.. ఇంటి మొత్తాన్ని జిమ్ముగా మార్చేసి నిరంతరం ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. నెలకు కావాల్సిన ఖర్చు మొత్తాన్ని ఒక్కరోజులో సంపాదించేస్తాడు. ఇoదుకు అతడు చేసే పని ఒక కాలేజీని సందర్శించడం మాత్రమే.. తన బంధువులు కాలేజీలో ఉన్నారని వారికి ఫీజు కట్టాలని కాలేజీ సిబ్బందిని ఫీజు కట్టించుకునే విభాగం ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ రూమ్ దగ్గరికి.. ఆ రూమ్‌కి సంబంధించిన బ్లూ ప్రింట్ మొత్తం.. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్‌లతో పాటు క్యాష్ ఉంచే ప్లేస్ వరకు అన్నింటినీ క్షుణ్ణంగా అదే రోజు రాత్రి కేవలం గేటు దగ్గర మాత్రమే సెక్యూరిటీ ఉందని గమనించి ఎలాగోలా లోపలికి వెళ్లి తనతో తీసుకెళ్లిన కట్టర్లు, ఇనుప రాడ్లతో కిటికీలు తొలగించి డబ్బు కాజేస్తాడు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ 2013 నుంచి చోరీలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు ఏడుసార్లు వివిధ జైళ్లకు వెళ్ళొచ్చాడు.
జైలులో ఉన్న సమయంలో తనను వేధించిన తోటి ఖైదీని చంపాలని జైలు నుంచి బయటకు వచ్చాక నిర్ణయించుకున్నాడు. దాని కోసం బీహార్ నుంచి మూడు గన్స్ తెప్పించాడు. వీటితో పాటు 500 బుల్లెట్లను తెప్పించుకున్నాడు. ఈ గన్స్‌ను బెదిరింపులకు పాల్పడేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ప్రిజమ్ పబ్ వద్ద కూడా ఇతడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ప్రభాకర్ శరీరం మీద మూడు టాటూలు పోలీసులు గుర్తించారు. అందులో 3, +, 100 అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ మూడింటికి మూడు అర్థాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 3 అంటే ఒకేసారి మూడు కోట్ల రూపాయలను చోరీ చేయటం ఇతడి టార్గెట్.. వందమంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని అనుభవించాలని ఇతగాడు ఆశ. తన టార్గెట్లను ఎక్కడ మరిచిపోతాడోనని ఇలా శరీరం మీద పచ్చబొట్టు పొడిపించుకుని అందరిని షాక్‌కు గురి చేశాడు.
ఇతడు చోరీ చేసే విధానం, చోరీ చేశాక తప్పించుకునే వ్యూహాలు పోలీసులకు సైతం అంతు చిక్కలేదు. అందుకు కారణం ఇతడు వేసే వ్యూహాలే.. సాధారణంగా ఏదైనా చోరీలు చేసేవారు కచ్చితంగా ఒక ముఠాగా ఏర్పడి ప్లాన్ చేసి దానిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సింగిల్ హ్యాండ్ గణేష్ రీతిలో అంతా తానై చూసుకున్నాడు ప్రభాకర్. ప్లాన్ అతనే వేస్తాడు. రెక్కీ అతనే నిర్వహిస్తాడు. చోరీ అతనే చేస్తాడు. చివరికి లాభం కూడా ఒక్కడే అనుభవిస్తాడు. కొట్టేసిన డబ్బు మొత్తాన్ని జల్సాలకు వినియోగిస్తాడు. ప్రభాకర్‌కు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. తాను కొట్టేసిన 2.5 కోట్ల రూపాయలలో పోలీసులకు కేవలం 62,000 రూపాయలు మాత్రమే దొరికిందంటే ప్రభాకర్ ఎంత జగత్ కిలాడినో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాకర్ నివసించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొట్టేసిన డబ్బును ఆచితూచి ఖర్చుపెడతాడు అనుకుంటే పొరపాటే.. ఇష్టం వచ్చినట్లు తనకు నచ్చిన అపార్ట్మెంట్‌ను సెలెక్ట్ చేసుకుంటాడు. గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో విలాసవంతమైన విల్లాల్లో నెలకు లక్ష రూపాయల అద్దె చెల్లిస్తూ ఉంటాడు. ఎక్కడైనా పోలీసులకు తన మీద అనుమానం వచ్చింది అని భావిస్తే చాలు వెంటనే మకాం మార్చేస్తాడు.
ఇక తాజాగా ప్రభాకర్ అరెస్ట్ అయ్యే సమయానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైతం తన రూమ్‌లో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి ప్రాంతంలోనే జాస్మిన్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాడు. అతడి ఇల్లు మొత్తం కూడా అత్యధిక జిమ్ పరికరాలు ఉండేవి. ఎంత తెలివిగా చోరీలు చేసి పోలీసుల నుంచి తప్పించుకున్న జిమ్ చేయటం మాత్రం అతడు మానలేదు. ఇక ప్రభాకర్ ఇంట్లో లభించిన బుల్లెట్లు చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఒక వ్యక్తి 500 బుల్లెట్లను దాచుకోవడం ఆషామాషీ విషయం కాదు. మూడు తుపాకుల్లో మహా అయితే 18 బుల్లెట్స్ పడతాయి. కానీ ప్రభాకర్ ఇంట్లో లభించిన సూట్ కేసులో ఈ గన్స్‌ను, బుల్లెట్స్‌ను స్టోర్ చేసుకున్నాడు. 19 ఏళ్లకే క్రిమినల్ ట్రాక్ రికార్డు తెరిచిన ప్రభాకర్‌కు గన్స్‌ను ఎలా కాల్చాలో ప్రత్యేక ప్రాక్టీస్ తీసుకున్నాడు. అయితే అతడికి ఎవ్వరూ గన్స్ ఇలా కాల్చాలి అని నేర్పించలేదు. తనకు తానుగా నగరం శివారులో ఉన్న రైల్వే స్టేషన్ పరిసరాలతో పాటు , ఔటర్ రింగ్ రోడ్ వద్ధ ఉన్న చెట్ల పొదల్లో ఈ షూటింగ్‌ను ప్రాక్టీస్ చేశాడు.
ఇంత విలాసవంతంగా జీవిస్తున్న ప్రభాకర్ దినచర్య ఒక వీఐపీలా ఉండేది. పొద్దున లేవగానే గంటల తరబడి జిమ్ చేస్తుంటాడు. తనకు నచ్చిన ఆహారం తింటాడు. ఇక సాయంత్రం అవగానే తనకు నచ్చిన పబ్బుకు వెళ్లి షికారు చేస్తుంటాడు. ఇక అమ్మాయిల సంగతి చెప్పనక్కర్లేదు. 2020లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకొని వదిలేసాడు. ఇక తాజాగా ఒడిస్సాకు చెందిన మరో అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. ప్రిజం పబ్బు ఘటనకు ముందు సదరు అమ్మాయిని ఒడిస్సాకు పంపించాడు. ప్రభాకర్ కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు కాచుకుని కూర్చున్నారు. అతడు ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు అరెస్టు చేసి తీసుకెళ్దామా అనే ధోరణితో పోలీసులు అనేక రాష్ట్రాల్లో గాలించారు. చివరికి తెలంగాణ సైబరాబాద్ పోలీసులకు ప్రిజమ్ పబ్ వద్ద దొరికాడు.
ఇంతటి నేర చరిత్ర కలిగిన ప్రభాకర్ కుటుంబ నేపథ్యం షాక్ కు గురి చేస్తుంది .ప్రభాకర్ కాల్పులు జరిపిన సమయంలో గాయపడ్డ కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి హాస్పిటల్లో కోరుకుంటున్నాడు. ఇక ఈ ఘటన తరువాత ప్రభాకర్ కోసం ఇతర రాష్ట్రాల పోలీసులు గచ్చిబౌలి పోలీసులను సంప్రదిస్తున్నారు. త్వరలోనే అతనిపై పీడీ యాక్ట్ సైతం నమోదు చేయబోతున్నారు సైబరాబాద్ పోలీసులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి