Film Updates: చిన్న కథకు పెద్ద ఘనత.. పక్కకు తప్పుకున్న జీబ్రా..

2 hours ago 1

35 చిన్న కథ కాదు సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ఏఎన్నార్ శత జయంతిని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అక్కినేని నాగార్జున. బాలీవుడ్ లెజెండరీ స్టార్ మీనాకుమారి జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్‌. శివకార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ అమరన్‌.  ఇలా తాజా సినిమా న్యూస్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. 

|

Updated on: Oct 27, 2024 | 3:45 PM

35 చిన్న కథ కాదు సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. నవంబర్‌లో జరగనున్న గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. కేవలం 25 చిత్రాలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ప్రస్తుతం 35 చిన్న కథ కాదు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.

1 / 5

ఏఎన్నార్ శత జయంతిని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న అక్కినేని నాగార్జున, ఈ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు అబితాబ్‌ బచ్చన్‌, మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించారు. ఈ వేదిక మీద చిరంజీవికి ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డును బిగ్ బీ చేతుల మీదుగా అందచేయనున్నారు.

2 / 5

బాలీవుడ్ లెజెండరీ స్టార్ మీనాకుమారి జీవితం ఆధారంగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్‌. సిద్దార్థ్ పి మల్హోత్రా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌లో కియారా అద్వానీ నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. కమల్‌ ఔరా మీనా పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాకుమారి జీవితంలోని లవ్ యాంగిల్‌ను మాత్రమే చూపించబోతున్నారు.

3 / 5

శివకార్తికేయన్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ అమరన్‌. కమల్‌ హాసన్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకుడు. అక్టోబర్ 31న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యు బై ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.

4 / 5

 కన్నడ నటుడు డాలీ ధనుంజయ్‌, టాలీవుడ్ స్టార్ సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ జీబ్రా. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన మేకర్స్‌, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ వెల్లడిస్తామన్నారు.

5 / 5

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article