డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఇందులో కియారా అద్వానీ, శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలు పోషిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
Sj Surya, Game Changer
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్ విడుదల కాగా.. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదుసుచూస్తున్నారు ఫ్యాన్స్. అలాగే ఈ మూవీ అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు.. ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్న సంగతి తెలిసిందే.
అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై నటుడు ఎస్జే సూర్య ఆసక్తికర ట్వీట్ చేశారు. “హాయ్ ఫ్రెండ్స్.. నేను ఈ గేమ్ ఛేంజర్ సినిమాలోని రెండు ముఖ్యమైన సీన్స్ డబ్బింగ్ ఇప్పుడే పూర్తి చేశాను. ఆ సీన్స్ లో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ గారితో..ఇంకోటి శ్రీకాంత్ గారితో ఉన్నాయి. ఈ రెండు సీన్స్ డబ్బింగ్ చెప్పడానికి నాకు మూడు రోజులు పట్టింది. ఆ సీన్స్ అవుట్ ఫుట్ దీనమ్మ దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది అనిపించేలా వచ్చింది. థియేటర్లలో అరుస్తారు ఆ సీన్స్ కు. పోతారు మొత్తం పోతారు.. థాంక్యూ డైరెక్టర్ శంకర్ గారూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు. దిల్ రాజు గారు సంక్రాంతికి ర్యాంప్ ఆడిస్తున్నారు” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో గేమ్ ఛేంజర్ పై మరింత బజ్ పెరిగింది.
ఇవి కూడా చదవండి
ఎస్జే సూర్య ట్వీట్ తో ఇప్పుడు మెగా అభిమానులు నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా అదిరిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి త్వరలోనే మెలోడి సాంగ్ రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ సోలోగా వస్తున్న మూవీ ఇదే. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
Hi friends , I conscionable finished dubbing of 2 captious scenes successful #GAMECHANGER (one with our Global prima @AlwaysRamCharan garu & different with Srikant garu … it took 3 full days to decorativeness these 2 scenes dubbing …. The retired enactment came retired similar “ dheenamma dhimma thirigi bomma…
— S J Suryah (@iam_SJSuryah) November 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.