ఈ ఏడాది జనవరి మధ్యలో పూణేలోని కిర్కత్వాడి ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల మహిళ పక్షవాతానికి గురై పూణెలోని హాస్పిటల్లో చేరింది. పూణేలోని సిన్హాగడ్ రోడ్‌కు సమీపంలోని వారి టౌన్షిప్లో వారం రోజుల క్రితం డయేరియాతో బాధపడుతున్న మహిళ ఉన్నట్లుండి నడుం కింది భాగంలో తిమ్మిరి, చివరికి పక్షవాతానికి గురైనట్లు బాధిత మహిళ వైద్యులకు తెలిపాడు. ఆ తర్వాత టౌన్‌షిప్‌లోని మరో ముగ్గురు ఇదే లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ నలుగురు రోగులకు GBS బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మొదటి రోగి మల నమూనా పరీక్షలో క్యాంపిలోబాక్టర్ జెజుని అనే వ్యాధికారక బ్యాక్టీరియాను వైద్యులు గుర్తించారు. క్యాంపిలోబాక్టర్ జెజుని అనేది కలుషితమైన నీరు, పచ్చి పాలు, కలుషితమైన మాంసం ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా.
జనవరి నెలారంభం నుంచి ఇదే నగరంలో 110 గులియన్-బారే సిండ్రోమ్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. పూణేకు చెందిన రోగి సోలాపూర్‌లో సిండ్రోమ్‌కు చికిత్స పొందుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆదివారం మరణించాడు. పూణేలో మరో 13 మంది రోగులు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతున్నారు. మొత్తం రోగులలో 20 తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు కూడా ఉన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ద్వారా స్టూల్ శాంపిల్స్‌ను పరీక్షించిన 44 మంది రోగులలో, ఐదుగురికి క్యాంపిలోబాక్టర్ జెజుని ఇన్ఫెక్షన్లు ఉండగా, 14 మందికి నోరోవైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. నోరోవైరస్ ఒక వ్యక్తి నుంచి మరొకరికి ప్రత్యక్షంగా తాకడం, గాలి ద్వారా వ్యాపిస్తుంది. రెండు వ్యాధికారకాలు జ్వరం, కడుపు నొప్పి, విరేచనాలు కలిగిస్తాయి. రెండు మూడు రోజుల తర్వాత ఈ లక్షణాలు తగ్గుతాయి. ఆ తర్వాత మూడు రోజులు లక్షణరహితంగా ఉంటారు. ఇది క్రమంగా తిమ్మిరిగా మారి పక్షవాతానికి దారి జీబీఎస్ వ్యాధిగా అభివృద్ధి చెందుతుందని.. ఇన్ఫెక్షియస్ వ్యాధుల నిపుణుడు డాక్టర్ అమీత్ ద్రావిడ్ తెలిపారు.
Guillain-Barre సిండ్రోమ్‌లో రోగుల రోగనిరోధక వ్యవస్థ, నరాల కణాలపై దాడి చేస్తుంది. ఇది వ్యాధికారక జీవిని యాక్టివ్ చేయడం వల్ల పక్షవాతం, తిమ్మిరి, బలహీనతకు దారితీస్తుంది. ఇది రోగి ఒంట్లో రోజులు, సంవత్సరాలు కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి కారణమవుతుంది. ప్రస్తుతం పూణేలో క్యాంపిలోబాక్టర్, నోరోవైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి తీవ్రంగా ఉంది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ స్టేట్స్ ప్రకారం.. క్యాంపిలోబాక్టర్ సోకిన ప్రతి వెయ్యి మంది రోగులలో ఒకరికి GBS (Guillain-Barre Syndrome) సిండ్రోమ్ అభివృద్ధి అవుతుందని, అయితే నోరోవైరస్ విషయంలో ఈ మార్పు కాస్త అరుదుగా ఉంటుందని పేర్కొంది. అయితే క్యాంపిలోబాక్టర్, నోరోవైరస్ ఇన్ఫెక్షన్ల మూలాలు మాత్రం ఇంకా కనుగొనలేదని, ఆరోగ్య బృందాలు ప్రతిరోజూ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
పూణేలో జనవరి 9న మొదటి కేసు నమోదైంది. ఆదివారం నాటికి 88 మంది రోగులు పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, 15 మంది పక్కనే ఉన్న పింప్రి చించ్వాడ్లో, ఏడుగురు సమీప గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పట్టణ నివాసాలు, గ్రామాలు, వ్యవసాయ భూమి, పౌల్ట్రీ ఫామ్‌లు ఉన్న ప్రాంతాల్లో అధిక కేసులు నమోదవుతున్నాయి. ఒక్క సింహగడ్ రోడ్‌లోని జీబీఎస్ రోగులలో అరవై శాతం మంది డయేరియాతో బాధపడుతున్నారని రాష్ట్ర ఆరోగ్య తెలిపింది. కలుషితమైన నీరు, బహుశా పౌల్ట్రీ ఫామ్‌లు మానవ నివాసాలకు దగ్గరగా ఉండటం వల్ల ఈ అంటువ్యాధులు వ్యాపిస్తున్నట్లు ఓ అధికారి అభిప్రాయపడ్డారు. క్యాంపిలోబాక్టర్ జెజుని సోకిన ప్రతి లక్ష మంది రోగులలో 0.3 మంది GBSను అభివృద్ధి చెందుతుందని, పూణేలో GBS ఇన్ఫెక్షన్లు లక్ష కంటే ఎక్కువ ఉండవచ్చని అధాకారులు భావిస్తున్నారు. ఎందుకంటే పూణెలో ఇప్పటికే పలు ఆస్పత్రుల్లో డయేరియాలో బాధపడుతున్న రోగులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నారు. ప్రభావిత ప్రాంతంలోని 64,238 మందిని డోర్-టు డోర్ సర్వే చేయగా జనవరి 25 వరకు 124 అతిసార కేసులు గుర్తించారు. నగరం మొత్తంలో మరిన్ని కేసులు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక GBS ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నేపథ్యలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.