రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. విజయ్ నటించిన గీతా గోవిందం, టాక్సీవాలా, పెళ్లి చూపులు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయ్ కెరీర్ లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో గీతా గోవిందం ఒకటి. డైరెక్టర్ పరశుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ జోడిగా రష్మిక మందన్నా నటించింది. తొలిసారిగా వీరిద్దరు కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాతో ఈ జోడిగా మంచి క్రేజ్ వచ్చింది.
2018లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా.. ఇందులోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈసినిమాలో రష్మిక కాకుండా మరో అమ్మాయి మరింత ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో విజయ్ ను ప్రేమించిన స్టూడెంట్ గా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఆ బ్యూటీ పేరు అనీషా దామా. ఇందులో కనిపించింది కాసేపు అయినప్పటికీ తన నటనతో గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంది.
గీత గోవిందం తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న అనీషా.. హీరోయిన్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సత్తిగాని రెండెకరాలు సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..