సాధారణంగా అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల వికారంగా, వాంతులు అవుతూ ఉంటాయి. ఇలా ఎక్కువగా ప్రయాణం చేసే వారిలో కనిపిస్తుంది. ఈ లక్షణం ప్రెగ్నెన్సీ మహిళలలో కూడా కనిపిస్తుంది. చాలా మంది వాంతులు అవగానే భయ పడిపోతూ ఉంటారు. అయితే వాంతులు అవడం వల్ల చాలా నీరసంగా, కళ్లు తిరిగినట్టు ఉంటుంది. వాంతులు అయిన వెంటనే కాస్త విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. నిజానికి వాంతులు అవడం అనేది జీవ రక్షణ విధానం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కడుపులోని విష పదార్థాలు, మలినాలు అనేవి బయటకు వెళ్లకుండా ఉంటే.. వాంతుల ద్వారా శరీరం బయటకు పంపుతుంది. ఒకటి, రెండు అయితే పర్వాలేదు. అధికంగా అయితే మాత్రం వైద్యుల్ని సంప్రదించడం మేలు. వాంతులు కావడానికి అనేక కారణాలు ఉంటాయి. మరి వాంతుల్ని కంట్రోల్ చేయడంలో, వెంటనే రిలీఫ్ పొందడంలో కొన్ని హోమ్ రెమిడీస్ ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూడండి.
అల్లం టీ:
వాంతులను కంట్రోల్ చేయడంలో అల్లం ఎంతో చక్కగా సహాయ పడుతుంది. అల్లం జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిది. ఇది కడుపులో వాంతులకు కారణం అయ్యే అనవసరమైన స్రావాలన్ని నిరోధించడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి అకారణంగా వాంతులు అవుతూ ఉంటే తగ్గించడానికి అల్లం టీని తీసుకోండి.
లవంగాలు:
లవంగాల్లో కూడా అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో కూడా జీర్ణ వ్యవస్థకు సహాయ పడే గుణాలు ఉంటాయి. మీకు వాంతులు అవుతూ ఉంటే.. రెండు లేదా మూడు లవంగాలను నోట్లో వేసుకుని నమలండి. లవంగాలను నమలడం ఇష్టం లేని వాళ్లు లవంగాల పొడిన తేనెతో కలిపి తాగినా ఈ వాంతుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి
నిమ్మరసం:
వాంతులను కంట్రోల్ చేయడంలో నిమ్మ రసం కూడా చక్కగా పని చేస్తుంది. ఓ గ్లాసు నీటిలో నిమ్మరసం, ఉప్పు పిండి తాగండి. ఇది మీకు శక్తిని ఇవ్వడమే కాకుండా వాంతులను కూడా కంట్రోల్ చేస్తుంది.
గంజి నీరు:
గంజి నీరు తాగడం వల్ల కూడా వాంతులు కంట్రోల్ అవుతాయి. గంజిని పల్చగా నీళ్లు వేసి కలిపి అందులో నిమ్మ రసం, ఉప్పు కలిపి తాగినా కూడా వాంతులు తగ్గుతాయి. శక్తి కూడా పెరుగుతుంది. బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది.
పుదీనా:
వాంతులను తగ్గించడంలో పుదీనా కూడా పని చేస్తుంది. పుదీనా ఆకుల్ని నమిలినా, పుదీనాను నీటిలో మరిగించి తీసుకున్నా కూడా వాంతులు అనేవి కంట్రోల్ అవుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.