kurukshetra: కురుక్షేత్రలో జరగనున్న గీతా మహోత్సవ వేడుకలకు వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..

2 hours ago 1

అంతర్జాతీయ గీతా మహోత్సవం 28 నవంబర్ నుంచి 15 డిసెంబర్ 2024 వరకూ హర్యానాలోని కురుక్షేత్రలో జరగబోతోంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ కుటుంబంతో పాటు 2 నుంచి 3 రోజుల పాటు కురుక్షేత్రాన్ని సందర్శించబోతున్నట్లయితే.. అక్కడ ఉన్న కొన్ని చారిత్రక, అందమైన ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు.

Surya Kala

|

Updated on: Nov 18, 2024 | 7:04 PM

ఈ ఏడాది గీతా మహోత్సవం నవంబర్ 28 నుంచి కురుక్షేత్రలో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఈ గీతా జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 11వ తేదీన ఏకాదశి రోజున దీపదానం చేయనున్నారు.

ఈ ఏడాది గీతా మహోత్సవం నవంబర్ 28 నుంచి కురుక్షేత్రలో ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 15 వరకు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. ఈ గీతా జయంతిని పురస్కరించుకుని డిసెంబర్ 11వ తేదీన ఏకాదశి రోజున దీపదానం చేయనున్నారు.

1 / 6

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉత్సవాలపై ప్రజల్లో అత్యుత్సాహం నెలకొంది. అటువంటి పరిస్థితిలో మీరు మూడు రోజులు ఆ ఉత్సవాలను దర్శించుకోవడానికి కురుక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటే.. కుటుంబంతో కలిసి సందర్శించడానికి ప్లాన్ చేస్తుంటే కురుక్షేత్రంతో పాటు చుట్టుపక్కల చూడదగ్గ కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉత్సవాలపై ప్రజల్లో అత్యుత్సాహం నెలకొంది. అటువంటి పరిస్థితిలో మీరు మూడు రోజులు ఆ ఉత్సవాలను దర్శించుకోవడానికి కురుక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటే.. కుటుంబంతో కలిసి సందర్శించడానికి ప్లాన్ చేస్తుంటే కురుక్షేత్రంతో పాటు చుట్టుపక్కల చూడదగ్గ కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

2 / 6

 హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న శ్రీ కృష్ణ మ్యూజియం.. శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. శ్రీ కృష్ణుడికి సంబంధించిన అనేక సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ మ్యూజియంలో అనేక శిల్పాలు, పెయింటింగ్‌లు, శాసనాలు, కళాఖండాలు, టెర్రకోట కళాఖండాలు శ్రీకృష్ణుని గురించి సమాచారాన్ని అందించడానికి ఉంచబడ్డాయి. ఈ మ్యూజియంలో కురుక్షేత్ర, ద్వారక, మధురకు సంబంధించిన సేకరణలు ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని కుటుంబంతో సందర్శించడం మంచి అనుభూతిని ఇస్తుంది.

శ్రీ కృష్ణ మ్యూజియం: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న శ్రీ కృష్ణ మ్యూజియం.. శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. శ్రీ కృష్ణుడికి సంబంధించిన అనేక సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ మ్యూజియంలో అనేక శిల్పాలు, పెయింటింగ్‌లు, శాసనాలు, కళాఖండాలు, టెర్రకోట కళాఖండాలు శ్రీకృష్ణుని గురించి సమాచారాన్ని అందించడానికి ఉంచబడ్డాయి. ఈ మ్యూజియంలో కురుక్షేత్ర, ద్వారక, మధురకు సంబంధించిన సేకరణలు ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని కుటుంబంతో సందర్శించడం మంచి అనుభూతిని ఇస్తుంది.

3 / 6

 ఈ పేరులోనే ఉంది.. బ్రహ్మ సరోవరం పేరు బ్రహ్మ దేవుడితో ముడిపడి ఉంది. ఇక్కడ సరోవరంలో స్నానం చేయడానికి చాలా మంది వస్తుంటారు. ఈ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న శివుని ఆలయాన్ని సర్వేశ్వర మహాదేవ ఆలయాన్ని అని కూడా అంటారు. ఈ సరస్సు చాలా అందంగా ఉంటుంది. సూర్యగ్రహణం సందర్భంగా ఇక్కడ జరిగే స్నానాల జాతరకు వేలాది మంది ప్రజలు తరలివస్తారు. ఇక్కడ సూర్యాస్తమయం అందమైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు గంటల తరబడి వేచి ఉంటారు.

బ్రహ్మ సరోవరం: ఈ పేరులోనే ఉంది.. బ్రహ్మ సరోవరం పేరు బ్రహ్మ దేవుడితో ముడిపడి ఉంది. ఇక్కడ సరోవరంలో స్నానం చేయడానికి చాలా మంది వస్తుంటారు. ఈ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న శివుని ఆలయాన్ని సర్వేశ్వర మహాదేవ ఆలయాన్ని అని కూడా అంటారు. ఈ సరస్సు చాలా అందంగా ఉంటుంది. సూర్యగ్రహణం సందర్భంగా ఇక్కడ జరిగే స్నానాల జాతరకు వేలాది మంది ప్రజలు తరలివస్తారు. ఇక్కడ సూర్యాస్తమయం అందమైన దృశ్యాన్ని చూడటానికి ప్రజలు గంటల తరబడి వేచి ఉంటారు.

4 / 6

 కురుక్షేత్రలోని నరకతారి గ్రామంలో ఉంది. ఈ కుండం చరిత్ర మహాభారతానికి సంబంధించినది. కురుక్షేత్రంలో భీష్ముడు బాణాలతో గాయపడినప్పుడు.. అతను అంపశయ్య మీద నుంచే యుద్ధాన్ని వీక్షించాడని నమ్ముతారు. ఈ ప్రదేశంలో ఒక దేవాలయం .. ఒక చెరువు ఉన్నాయి. భీష్మ కుండాన్ని బంగంగా అని కూడా అంటారు.

భీష్మ కుండం: కురుక్షేత్రలోని నరకతారి గ్రామంలో ఉంది. ఈ కుండం చరిత్ర మహాభారతానికి సంబంధించినది. కురుక్షేత్రంలో భీష్ముడు బాణాలతో గాయపడినప్పుడు.. అతను అంపశయ్య మీద నుంచే యుద్ధాన్ని వీక్షించాడని నమ్ముతారు. ఈ ప్రదేశంలో ఒక దేవాలయం .. ఒక చెరువు ఉన్నాయి. భీష్మ కుండాన్ని బంగంగా అని కూడా అంటారు.

5 / 6

 జ్యోతిసర్ దేవాలయం కురుక్షేత్ర-పిహోవా రహదారిపై థానేసర్‌కు పశ్చిమాన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మర్రిచెట్టు కింద కూర్చొని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశించాడని ప్రతీతి. ఇది మతపరమైన, ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడ సాయంత్రం హిందీ, ఆంగ్లంలో సౌండ్ షో నడుస్తుంది

జ్యోతిసర్ దేవాలయం: జ్యోతిసర్ దేవాలయం కురుక్షేత్ర-పిహోవా రహదారిపై థానేసర్‌కు పశ్చిమాన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మర్రిచెట్టు కింద కూర్చొని శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశించాడని ప్రతీతి. ఇది మతపరమైన, ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడ సాయంత్రం హిందీ, ఆంగ్లంలో సౌండ్ షో నడుస్తుంది

6 / 6

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article