పెళ్లిళ్ల సీజన్ మధ్య బంగారం ధర నేడు కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. GST లేకుండా 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 10 గ్రాములకు ధర ఏకంగా రూ.85,200 వద్ద కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి 9.30 గంటల సమయానికి తులం బంగారంపై ఏకంగా రూ.1,040 వరకు పెరిగింది. అలాగే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్లో వెండి కిలోకు రూ.99,500 వద్ద ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వెండి కిలో లక్షా 7 వేలుపైగా ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) బంగారం ధరలను రోజుకు రెండుసార్లు, మధ్యాహ్నం, సాయంత్రం విడుదల చేస్తుంది. మీ నగరంలో బంగారం, వెండి ధరలో 1000 నుండి 2000 రూపాయల వరకు తేడా ఉండవచ్చు. ఈరోజు వెండి ధరపై ఏకంగా రూ.1628 పెరిగింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.85,200 వద్ద ఉంది.
ఇది కూడా చదవండి: BSNL: మీ మొబైల్‌లో ఉచితంగా టీవీ చూడండి.. బీఎస్‌ఎన్‌ఎల్ అద్భుతమైన ఆఫర్!
మరోవైపు చైనా-అమెరికా సుంకాల యుద్ధం మధ్య సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా డిమాండ్ పెరగడంతో బంగారం ప్రపంచవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. స్పాట్ బంగారం ఔన్సుకు 0.2 శాతం పెరిగి $2,847.33కి చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో రికార్డు స్థాయిలో $2,848.94కి చేరుకుంది. US బంగారు ఫ్యూచర్స్ $2,876.10 వద్ద స్థిరంగా ఉన్నాయి. ట్రంప్ సుంకాల విధానాలు, డాలర్ కదలికలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు బంగారం ధరలకు ప్రధాన ట్రిగ్గర్లు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మానవ్ మోడీ మాట్లాడుతూ.. ట్రంప్ విధానాలు అనిశ్చితిని పెంచడమే కాకుండా ద్రవ్యోల్బణ ప్రమాదాన్ని కూడా పెంచుతున్నాయని, ఇది బంగారం ధరలకు మద్దతు ఇస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర బ్యాంకులు నెమ్మదిగా బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తున్నందున ఊహాగానాలు, పెట్టుబడి డిమాండ్ బలంగా ఉంది. అధిక ధరలు డిమాండ్‌ను తగ్గించే అవకాశం ఉన్నందున స్వల్పకాలిక రికవరీ అవకాశం ఉన్నప్పటికీ, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య దీర్ఘకాలిక దృక్పథం బుల్లిష్‌గా ఉందన్నారు. ప్రపంచ ఉద్రిక్తతలు ఎలా ఉంటాయో బంగారం ధరలను ప్రభావితం చేస్తుందని, MCX బంగారం సంవత్సరం చివరి నాటికి రూ. 100,000 కు చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 86,000 కు చేరుకోగలదా లేదా అనే దానిపై US ఫెడరల్ రిజర్వ్ వైఖరి ఏమిటనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ATM Cash Withdrawal: ఏటీఎంలపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనుందా? నగదు విత్‌డ్రాపై ఛార్జీలు పెంచనుందా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..