Gukesh Vs Ding Liren: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత గ్రాండ్‌మాస్టర్ డి గుకేష్, చైనాకు చెందిన డింగ్ లిరెన్ మధ్య పోరు ఉత్కంఠగా కొనసాగుతోంది. మంగళవారం ఇద్దరూ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్‌లో వరుసగా నాలుగో గేమ్ డ్రా కావడం గమనార్హం. ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన రెండో, నాలుగో, ఐదో, ఆరో గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. చైనాకు చెందిన 32 ఏళ్ల లిరెన్ తొలి గేమ్‌ను గెలుపొందగా, 18 ఏళ్ల గుకేశ్ మూడో గేమ్‌ను గెలుచుకున్నాడు.
7వ గేమ్ సమయంలో, తెల్ల కాయిన్స్‌తో ఆడుతున్న గుకేశ్ పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ, చైనీస్ స్టార్ అద్భుతమైన డిఫెన్స్ చేయడంతో డ్రాగా ముగిసింది. 72 మూవ్స్ తర్వాత, గుకేశ్ ఒక బంటుతో ముందున్నాడు. ఈ డ్రా గేమ్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు తలో 3.5 పాయింట్లతో సమంగా నిలిచారు. 14 గేమ్‌ల మ్యాచ్‌లో 7.5 పాయింట్లు సాధించిన మొదటి ఆటగాడు మ్యాచ్ గెలుస్తాడు. అలాగే, ప్రపంచ ఛాంపియన్‌గా మారతాడు.
ప్రస్తుతం గుకేశ్ భారీ ఆధిక్యంలో ఉన్నాడు. ఒకానొక సమయంలో లిరెన్ మళ్లీ గేమ్‌ను కోల్పోతాడని అనిపించింది. కానీ అతను 16 నిమిషాల్లో 15 కదలికలు చేయాల్సి వచ్చింది. 40వ ఎత్తులో, ఓటమిని తప్పించుకోవడానికి అతనికి 7 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకానొక సమయంలో గుకేష్ కూడా టైం ఒత్తిడిలో చిక్కుకున్నాడు. కేవలం 2 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు అతను తన 56వ మూవ్ చేశాడు. గుకేష్ చివరి వరకు ఒక అడుగు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అతను దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇవి కూడా చదవండి
5 గంటల 20 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్..
7వ మ్యాచ్ 5 గంటల 20 నిమిషాల పాటు సుధీర్ఘంగా సాగింది. చివరి మ్యాచ్ నాలుగు గంటలకు పైగా సాగింది. ఫైనల్‌లో ఇప్పటివరకు ఇదే అత్యంత సుదీర్ఘమైన గేమ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..