హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్వాప్ చేయగలిగిన డ్యూయల్ 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలు ఏర్పాటు చేశారు. సింగిల్ చార్జింగ్ తో సుమారు 102 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. కేవలం 7.3 సెకన్లలో సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. రైడర్లు తమకు అవసరమైన విధంగా ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్ లకు మారవచ్చు. ఈ స్కూటర్ లో 7 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. హోండా రోడ్ సింక్ డుయో స్మార్ట్ ఫోన్ యాప్ తో అనుసంధానం చేయబడి ఉంటుంది. నావిగేషన్ తో పాటు ఇతర స్మార్ట్ ఫంక్షనాలిటీలను అందజేస్తుంది. హెచ్ స్మార్ట్ కీ సిస్టమ్ తో పాటు పెరల్ సెరినిటీ బ్ల్యూ, మాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్ తదితర ఎంపికల్లో ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. హోండా యాక్టివా ఇ స్కూటర్ ధర రూ.1.17 లక్షలుగా నిర్ణయించారు.
హోండా నుంచి విడుదలైన క్యూసీ1 స్కూటర్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. ఫుల్ చార్జింగ్ తో సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. స్కూటర్ లోని ఇన్ వీల్ మోటారు నుంచి గరిష్టంగా 1.8 కేడబ్లూ అవుట్ పుట్ విడుదల అవుతుంది. గంటకు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. దీనిలో బ్యాటరీని స్వాప్ చేసే అవకాశం ఉండదు. క్యూసీ1 స్కూటర్ లో ఎల్ సీడీ డిస్ ప్లే, యూఎస్ బీ టైప్ సి చార్జింగ్ పోర్టు, 26 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఆకట్టుకుంటున్నాయి. హోమ్ చార్జర్ ను ఉపయోగించి స్కూటర్ బ్యాటరీని చార్జింగ్ చేయవచ్చు. దాదాపు నాలుగున్నర గంటల్లో 80 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. యాక్టివా ఇ మాదిరిగానే ఐదు రకాల రంగుల్లో లభిస్తోంది. ఈ రెండు రకాల స్కూటర్లను రూ.వెయ్యి చెల్లించి బుక్కింగ్ చేసుకోవచ్చు.
రెండు స్కూటర్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్లు ఏర్పాటు చేశారు. యాక్టివా ఇలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అమర్చితే, క్యూసీ 1 రెండు చివర్లలో డ్రమ్ బ్రేకులున్నాయి. కస్టమర్ల కోసం హోండా కంపెనీ కొన్ని రాయితీలు అందిస్తోంది. ఈ రెండు మోడళ్లకు ఏడాదికి కాంప్లిమెంటరీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ తో పాటు మూడేళ్లు, లేదా 50 వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. హోండా కంపెనీకి చెందిన కర్ణాటకలోని నర్సాపుర ప్లాంట్ లో వీటిని తయారు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి