కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరంగా ఉండడం గమనార్హం. షమీ ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. వచ్చే రెండో టీ20 మ్యాచ్‌కు షమీ జట్టులో చేరే అవకాశం ఉందని ఊహిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ విభాగానికి మద్దతు అందించనున్నారు. అయితే, రెగ్యులర్ పేస్ బౌలర్లు అందుబాటులో లేకపోవడంతో అర్ష్దీప్ సింగ్ ఒక్కరే ప్రధాన పేసర్‌గా జట్టులో ఉన్నారు. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌లు నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా కూడా అవసరమైతే బంతితో తమ పరిజ్ఞానాన్ని చూపించే అవకాశముంది.
భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నారు, వీరు ప్రత్యర్థి బౌలింగ్‌ను ఛిద్రం చేయగలరు. భారత యువ జట్టు మంచి సమతౌల్యంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది.
ఇటు ఇంగ్లాండ్ జట్టుకు కూడా జోఫ్ర ఆర్చర్ తిరిగి వచ్చాడు. ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్ లతో జట్టు బలంగా కనిపిస్తుంది. ఇటీవల RCBలోకి చేరిన జాకబ్ బెథెల్ కూడా చోటు సంపాదించుకున్నాడు.
రెండు టీంల ప్లేయింగ్ XI భారత్:
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్:
జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ గెలుపు సాధించి సిరీస్‌లో ముందంజ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ వైపు యువ ఆటగాళ్లకు అదనపు ప్రాధాన్యం కల్పించగా, ఇంగ్లాండ్ తమ అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై ఆధారపడింది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. రెండు జట్ల మధ్య బలాబలాల పోరు మరింత ఉత్కంఠ రేపనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..