దిన ఫలాలు (ఫిబ్రవరి 04, 2025): మేష రాశివారికి ధన స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడంతో పాటు, ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. మేషం నుంచి మీనం రాశి వరకు మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Horoscope Today
దిన ఫలాలు (ఫిబ్రవరి 04, 2025): మేష రాశివారికి ధన స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడంతో పాటు, ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. సింహ రాశివారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పనిభారం ఎక్కువగా ఉండడం, అదనపు బాధ్యతలు మీద పడడం, అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందకపోవడం వంటివి జరుగుతాయి. మేషం నుంచి మీనం రాశి వరకు మంగళవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ధన స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవడంతో పాటు, ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యో గంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. లాభ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలైన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యలను, కష్టనష్టాలను అధిగమిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దశమంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు రాశ్యధిపతి బుధుడు రవితో కలవడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా లాభాలు పెరుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, లాభ స్థానంలో గురువు సంచారం వల్ల రోజంతా సుఖ సంతోషా లతో సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. సప్త మంలో రవి, బుధుల యుతి వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పనిభారం ఎక్కువగా ఉండడం, అదనపు బాధ్యతలు మీద పడడం, అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందకపోవడం వంటివి జరుగుతాయి. ప్రతి పనీ బాగా నిదానంగా పూర్తవుతుంది. దశమంలో గురు సంచారం వల్ల ఉద్యోగానికి ఢోకా ఉండదు. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సప్తమ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు, భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో సంపాదన బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన అవ కా శాలు అందుతాయి. ఆరవ స్థానంలో శని సంచారం వల్ల శత్రు, రోగ, రుణ సమస్యలు తగ్గుతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): రాశ్యధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టినందువల్ల, ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): శుక్ర, గురువుల మధ్య పరివర్తన జరిగినందువల్ల ఈ రాశి వారి మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. సామాజికంగా గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాలన్నీ సఫలమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- ధనుస్పు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): చతుర్థంలో శుక్రుడు ఉచ్ఛ పట్టినందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయ త్నాలు సఫలం అవుతాయి. ఆశించిన శుభ వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశిలో సంచరిస్తున్న రవి, బుధుల వల్ల ఉద్యోగం నిలకడగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇతరత్రా కూడా ధనా దాయం బాగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. బంధుమిత్రుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): గురు, శుక్రులు పరివర్తన చెందడం, ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో పురోగతి ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమ స్యలు పరిష్కారమవుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, రాశ్యధిపతి గురువుతో పరివర్తన చెందడం వల్ల ఏలిన్నాటి శని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. ఆదాయంలో ఆశిం చిన వృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరు గుతాయి. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశమున్నప్పటికీ వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.