మహా కుంభమేళా కారణంగా ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయిన వారిలో మోనాలిసా భోంస్లే ఒకరు. మధ్య ప్రదేశ్ ఇండోర్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ అమ్మాయి జీవనో పాధి కోసం కుంభమేళాకు వచ్చింది. పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటూ కొందరు యూట్యూబర్ల కంట పడింది. అంతే క్షణాల్లోనే మోనాలిసా ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలైపోయాయి. దేశ వ్యాప్తంగా ఈ అమ్మాయి పేరు మార్మోగిపోయింది. ఎంతలా అంటే మోనాలిసాను వెతుక్కుంటూ ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. తనతో సినిమా తీసేందుకు రెడీ అయిపోయాడు. బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన కొత్త సినిమా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో మోనాలిసా నటించనుంది. ఇటీవలే డైరెక్టర్ ఆమె ఇంటికి వెళ్లి మరి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక సినిమా ఆఫర్ రావడంతో మోనాలిసాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే మోనాలిసా తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ పోస్టర్ తో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతే కొద్ది క్షణాల్లోనే ఈ ఫొటో నెట్టింట వైరలైపోయింది.
‘ఈ రోజు పోస్టర్‌తో బయట ఉన్నా.. రేపటి రోజున థియేటర్లో కనిపిస్తా.. త్వరలోనే ముంబయిలో కలుద్దాం.. అల్లు అర్జున్ పుష్ప-2’ అంటూ తన పోస్ట్ కు క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది మోనాలిసా. దీనిని చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మోనాలిసాకు అల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
పుష్ప 2 పోస్టర్ తో మోనాలిసా..
आज पोस्टर के बहार कल अंदर होंगे यही समय का चक्र है जल्दी ही मुंबई में मिलेंगे
अल्लू अर्जुन पुष्पा -2 pic.twitter.com/zwEpb8x4Dp
— Monalisa Bhosle (@MonalisaIndb) February 3, 2025
కాగా ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో మోనాలిసా రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురిగా కనిపించనుందని సమాచారం. దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు కూడా ఈ సినిమాతోనే తెరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మోనాలిసా సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
आपका बहुत बहुत धन्यवाद सर, एक छोटे शहर की लड़की को मौका देने के लिए
‘द डायरी ऑफ मणिपुर’ फिल्म में लीड रोल देने के लिए @SanojMishra12 🙏 pic.twitter.com/YttXgGfdtV
— Monalisa Bhosle (@MonalisaIndb) January 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.