Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

2 hours ago 1

దిన ఫలాలు (నవంబర్ 26, 2024): మేష రాశి వారు ఉద్యోగంలో అధికారులకు సంతృప్తి కలిగించే విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృషభ రాశి వారికి రావలసిన సొమ్ము అవసర సమయంలో చేతికి అందుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

చేపట్టిన పనులు కొద్దిపాటి శ్రమతో పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో వివాదాలు తొలగిపో తాయి. వృత్తి, వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులకు సంతృప్తి కలిగించే విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. రావలసిన డబ్బు వసూలు చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. రావలసిన సొమ్ము అవసర సమయంలో చేతికి అందుతుంది. సోదరులతో వివాదాలు, విభేదాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారమై, సామరస్యం కలుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆశించిన శుభవార్త వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. అనుకోకుండా ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

చేపట్టిన పనుల్లో ఆలస్యాలు, ఆటంకాలు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. కానీ, ఆదాయ వ్యయాలు సమానంగా సాగుతాయి. అదనపు ఆదాయ మార్గాల వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. వివాదాలకు వీలై నంత దూరంగా ఉండడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. సామాజి కంగా ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం బాగా అను కూలంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో బంధువుల సాయం అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. ఉద్యోగంలో పదోన్నతికి ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో స్వల్పంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులన్నిటినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. బంధువులతో వాగ్వాదాలకు దిగకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికైనా వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లా సంగా సాగిపోతుంది. పిల్లల చదువుల పట్ల శ్రద్ద పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, సానుకూలంగా పురోగమిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. బంధు వుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో అధికా రులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక విషయాల్లో, ఆదాయ ప్రయత్నాల్లో అనుకూలతలు కలుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రయాణాల వల్ల లాభాలుం టాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు తగ్గ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయ వృద్ది ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ పని తీరు సంతృప్తి కలిగిస్తుంది. అధికారులు మీ సలహాలు, సూచనలకు విలువనిస్తారు. నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. వ్యాపా రాల్లో పోటీదార్ల సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో అధికారుల నుంచి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు బాగా లాభి స్తాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article