Horoscope Today: వారికి వాహన యోగం పట్టే ఛాన్స్.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

2 hours ago 1

దిన ఫలాలు (అక్టోబర్ 19, 2024): మేష రాశి వారికి శనివారంనాడు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వచ్చే అవకాశముంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

 వారికి వాహన యోగం పట్టే ఛాన్స్.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today 19th October 2024

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 19, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 19, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారంతో పాటు ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. బంధుమిత్రులకు కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు మారే సూచనలున్నాయి. వృత్తి జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆర్థికంగా కలిసి వస్తాయి ఇంటా బయటా ఒత్తిడి వల్ల మానసిక విశ్రాంతి తగ్గుతుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో బరువు బాధ్యతల కారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సా హంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. షేర్ల మీద పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. మిత్రులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ప్రయాణాల్లో వీలైనంత జాగ్ర త్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, తిప్పట తప్పకపో వచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందు తాయి. ఉద్యోగంలో పని తీరుతో అధికారులను, సహోద్యోగులను ఆకట్టుకుంటారు. ఉత్సాహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధి స్తారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆదాయం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆచి తూచి ఖర్చు చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో పనిభారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సమస్యల పరిష్కారం మీద కలిసి దృష్టి పెడతారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. బంధువుల నుంచి పెళ్లికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం, ఆరోగ్యం అనుకూ లంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. అందరినీ ఒక్క మాట మీదకు తీసుకు వస్తారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. అవసర సమయాల్లో బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించిన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో కీలక మార్పులు చేపడతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదువుల విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబంతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబపరంగా అదనపు పని భారం వల్ల ఇబ్బంది పడతారు. తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. తల్లితం డ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
  11. కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలకు అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు సజావుగా సాగిపోతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ప్రధాన సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవితం సానుకూ లంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇల్లు కొనడానికి ప్రయత్నాలు చేపడతారు. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article