Malaika Arora: నేను అదృష్టవంతురాలిని.. బ్రేకప్ తర్వాత మలైకా ఎమోషనల్ కామెంట్స్

2 hours ago 2

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా వ్యక్తిగత జీవితం కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె తండ్రి కొన్ని రోజుల క్రితం చనిపోయారు. అంతకు ముందు బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడూ ఒకరితో ఒకరు కనిపించే అర్జున్, మలైకా ఈ మధ్య విడివిడిగా కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా దీనిపై స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో, మలైకా తన జీవితం గురించి అలాగే ఆమెకు ఎదురైన సవాళ్ల గురించి మాట్లాడింది. కాగా జూన్‌లో అర్జున్ పుట్టినరోజు వేడుకల్లో మలైకా ఎక్కడా కనిపించలేదు. ఇది మాత్రమే కాదు, అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేయలేదు. దీంతో వీరిద్దరికి బ్రేకప్‌ అయిందనే టాక్‌ మొదలైంది. దీనిపై ఇద్దరూ ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు.ఈ ఇద్దరూ విడిపోయారని టాక్ బాలీవుడ్ లో గట్టిగానే వినిపించింది . అంతే కాకుండా ఫ్యాషన్ షోలో మలైకా, అర్జున్ ఒకరికొకరు దూరంగా కూర్చున్నారు.

ఇది కూడా చదవండి : ఎంత మోసం..! మసూద అని ముసుగేసారు కదరా..! ఇంత అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు

మనల్ని మనం లోతుగా తెలుసుకోవడం అనేది మనకు ఎలాంటి కష్టమైన పరిస్థితిలో ఉన్న ధైర్యాన్ని ఇస్తుంది అని మలైకా ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో తన కుటుంబసభ్యులు, సన్నిహితుల నుంచి తనకు ఎంతో మద్దతు లభించిందని చెప్పింది. “జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంలో నా కుటుంబం, స్నేహితులు, నా పని కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నా చుట్టూ ఉన్న వ్యక్తులు బలంగా ఉండటానికి నాకు చాలా సహాయం చేస్తారు. నా స్నేహితులు లేకుండా నేను లేను. వారు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నాకు మద్దతు ఇస్తారు, నాకు స్ఫూర్తినిస్తారు. వాళ్లే నాకు సర్వస్వం’’ అని మలైకా ఎమోషనల్ అయ్యింది. కాగా కరీనా కపూర్, కరిష్మా కపూర్, సోదరి అమృతా అరోరా మలైకాకు బెస్ట్ ఫ్రెండ్స్ .

ఇది కూడా చదవండి :అందచందాలు అదిరిపోయాయి.. కానీ వెనకాల కూడా చూసుకోవాలి కదమ్మా..!

జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఎలాంటి పశ్చాత్తాపం లేదని తెలిపింది మలైకా. “నా వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితంలో నేను తీసుకున్న ప్రతి నిర్ణయం నన్ను తీర్చిదిద్దింది. నేను ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నాను, అలాగే కొన్ని కొన్ని విషయాలు మారినందుకు నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చిందనే చర్చ సాగుతోంది.

ఇది కూడా చదవండి : Parvati Melton: పాపా.. పార్వతి ఇది నువ్వేనా..!! ఝలక్ ఇచ్చిన జల్సా బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article