వెబ్ సిరీస్‌గా లారెన్స్ బిష్ణోయ్ జీవితం.. ప్రధాన పాత్రలో ఏ హీరో నటిస్తున్నారో తెలుసా?

2 hours ago 1

మహారాష్ట్ర సీనియర్ పొలిటీషియన్‌ బాబా సిద్ధిఖీ మర్డర్ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మరుమోగుతోంది. బిష్టోయ్ తోపాటు అతని సోదరుడు అన్మోల్, సంపత్ మెహ్రా, గోల్డీ బ్రా, రోహిత్ గోదారా.. ఇలా బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీ పర్సనాలిటీలన్నీ బయటకు వస్తున్నాయి. బిష్ణోయ్ ముఠా ఐతే టార్గెట్ ఓరియంటెడ్‌గా పనిచేస్తుంది.. సైలెంట్‌గా స్పాట్ పెడుతుందే తప్ప ఇలా చెప్పి చెయ్యదు. వార్నింగులిచ్చి శత్రువుని ఊరికే భయపెట్టదు.. అనేది ముంబై పోలీసుల వెర్షన్.

ఒక వైపు సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అతనిని బెదిరిస్తున్నారు. మరోవైపు, ఈ గ్యాంగ్‌స్టర్ జీవితంపై ఇప్పుడు వెబ్ సిరీస్ రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ లారెన్స్ బిష్ణోయ్‌పై వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. పేరుతో పాటు ఇందులో లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారనేది కూడా చెప్పేశారు.

చాలా సంవత్సరాల క్రితం. కృష్ణజింకను చంపినప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేస్తోంది. భాయిజాన్‌ను చంపుతామని చాలాసార్లు బెదిరించారు. దీంతో హీరోకి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనలో లారెన్స్ బిష్ణోయ్ పేరు మాత్రమే చర్చనీయాంశమైంది. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ గురించే సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు అతనితో కొత్త వెబ్ సిరీస్ తీయబోతున్నారన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సిరీస్‌ను ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మించనుంది. ప్రొడక్షన్ హౌస్‌కి ఇప్పటికే ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ క్లియరెన్స్ ఇచ్చినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఆ సిరీస్ పేరు ‘లారెన్స్-ఎ గ్యాంగ్‌స్టర్’. ఈ సిరీస్ లారెన్స్ జీవితంలోని అన్ని విజయాలను ప్రస్తావిస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్‌గా తెరకెక్కించే ఆలోచనలో నిర్మాణ సంస్థ ఉందని తెలుస్తోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ పేరుమోసిన గ్యాంగ్ స్టర్ ఎన్నో అకృత్యాలు చేశాడు. అతను గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సీరియల్‌లో ప్రధాన అంశం. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పాత్రలో ఏ హీరో కనిపిస్తారనేది ప్రశ్న. హీరో పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ సిరీస్‌లో మొదటి పోస్టర్‌ని దీపావళికి విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఈ గ్యాంగ్‌స్టర్ భయంతో భాయిజాన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు ముంబై పోలీసులు. బిష్ణోయ్ గ్యాంగ్ చాలా కాలంగా సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తోంది. సల్మాన్‌ను చంపడానికి 25 లక్షల రూపాయలు చెల్లించినట్లు ముంబై పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఇక ఈసారి బాలీవుడ్ నటుడు సల్మాన్‌ను నేరుగా బెదిరించారు. పరిణామాలు బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా ఉంటాయని బెదిరింపులు వచ్చాయి. ముంబై పోలీసులకు ఈ బెదిరింపు సందేశం చేరింది. అయితే నటుడిని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరిస్తుందా? ముంబై పోలీసుల వాట్సాప్ నంబర్‌కు మెసెజ్ ఎలా వచ్చిందన్న దానిపై విచారణ కొనసాగుతోంది. పెళ్లి కూడా చేసుకోకుండా.. అమ్మాయిల కలల రాకుమారుడిగా.. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా, జీవితమంతా సినిమాలకే ఖర్చుపెడ్తున్న అపర త్యాగమూర్తి సల్లూ భయ్యా.. ఇప్పుడు ప్రాణాల్ని అరచేత పెట్టుకుని.. బతకాల్సిన పరిస్థితి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article