Tollywood: ఎక్స్‌పోజింగ్ చేయదు.. పోజ్ కొట్టదు.. కానీ ఫాలోయింగ్ తగ్గదు.. గుర్తుపట్టారా ఈ హీరోయిన్‌ని

1 hour ago 1

ఆమె లుక్స్‌కి, యాక్టింగ్‌కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. త్వరలో మంచి అవకాశాలు వస్తాయ్.. మేం లైఫ్ ఇస్తాం అంటున్నారు. ఇంతకీ ఈ హీరోయిన్ ‌ఎవరో గుర్తుపట్టారా..? ఈ మధ్య చాలా ట్రెండింగ్‌లో ఉందండోయ్....

 ఎక్స్‌పోజింగ్ చేయదు.. పోజ్ కొట్టదు.. కానీ ఫాలోయింగ్ తగ్గదు.. గుర్తుపట్టారా ఈ హీరోయిన్‌ని

Guess The Heroine

|

Updated on: Oct 19, 2024 | 12:04 PM

ముంగురుల చాటున తన అందమైన నవ్వును.. అంతకుమించిన ముఖారవిందాన్ని దాచిన ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?. తను ఇప్పుడు కుర్రాళ్లకు స్పెషల్ ఇంట్రస్ట్ అయిపోయింది. మాకు ఇలాంటి వైఫ్ కావాలి అని కామెంట్స్ పెడుతున్నారు పెళ్లికాని అబ్బాయిలు. కేరళ కుట్టి అయినప్పటికీ.. తెలుగు అమ్మాయిలానే ఉంటుంది. చీర కట్టులో తనని చూస్తుంటే.. ఈ సెకను ఇలా ఆగిపోతూ బాగుండు అనిపిస్తుంది. ఎక్స్‌పోజింగ్ చేయదు.. పోజ్ కొట్టదు.. కానీ ఫాలోయింగ్ తగ్గదు. ఇంతకీ తనెవరో మీరు ఏమైనా గెస్ చేయగలిగారా..? అయ్యో.. కష్టంగా ఉందా ఇక మేమే చెప్పేస్తాం లేండి.

తను మరెవరో కాదు హీరోయిన్ సంగీర్తన విపిన్. ఇటీవలే జనక అయితే గనక సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ. గత ఏడాది నరకాసుర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగీర్తన జనక అయితే గనకతో ఫస్ట్ హిట్ అందుకుంది. 2002లో కేరళలో పుట్టిన ఈ చిన్నది.. స్టడీస్ కంటిన్యూ చేస్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తను ఇప్పుడు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేస్తోంది. స్టడీకి ఇంపార్టెన్స్ ఇస్తూనే.. సినిమా కెరీర్‌ను కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. టీనేజ్‌లోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీకి.. ఆ తర్వాత సినిమా చాన్సులు రావడం ప్రారంభమయ్యాయి. మలయాళంలో హైగుటా మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నరకాసుర, ఆపరేషన్ రావణ్, అసురగణ రుద్ర సినిమాలు చేసింది. కాడువెట్టి అనే తమిళ్ సినిమా కూడా చేసింది.  ఎక్కడైనా మీదైన స్టైల్‌తో ట్రెండ్ క్రియేట్ చేయండి అంటూ నేటి యువతకు సందేశాన్ని ఇస్తుంది సంగీర్తన. ఈమె ఇన్ స్టాలోనూ చీరతో దిగిన పిక్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రకృతితో గడపడం ఈ నటీమణికి చాలా ఇష్టమట. మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని సంగీర్తనకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article