హైదరాబాద్ మెడికవర్ వైద్యులు అద్భుతం చేశారు. సోమాలియాకు చెందిన ఓ యువకుడికి ల్యాబ్‌లో కృత్రిమంగా తయారుచేసిన పురుషాంగాన్ని విజయవంతంగా అమర్చారు. సదరు వ్యక్తికి నాలుగేళ్ల వయసులో సున్తీ తర్వాత ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో పురుషాంగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో వృషణాల కింద నుంచి యూరిన్ పాస్ చేసే ఏర్పాటు చేశారు. ఇప్పుడా యువకుడికి 20 ఏళ్లు. మన హైదరాబాద్ డాక్టర్లు అరుదైన సర్జరీ ద్వారా అతడికి కొత్త ఊపిరి పోశారు. మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్, పాస్టిక్ సర్జర్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్‌లు ఈ సర్జరీ తాలూకా వివరాలు వెల్లడించారు.
సంవత్సరన్నర ముందు జరిగిన సర్జరీ అనంతరం యువకుడు పూర్తిగా కోలుకున్నట్లు వివరించారు. తాజాగా, అంగస్తంభన కోసం పినైల్ ఇంప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. 2 ఫేజుల్లో జరిగిన ఈ చికిత్స సక్సెస్ అయిందన్నారు. 20 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తీవ్ర ఇన్‌ఫెక్షన్ కారణంగా పురుషాంగాన్ని తొలగించినట్లు వెల్లడించారు. అయితే 18 ఏళ్ల వయసు వచ్చేప్పటికి.. యూరిన్ పాస్ చేయడంలో సమస్య రావడంతో.. అతను మెడికవర్ ఆస్పత్రికి వచ్చాడు. దీంతో డాక్టర్లు యూరిన్ సాఫీగా పాస్ అయ్యేలా సర్జరీ చేశారు. తర్వాత పురుషాంగాన్ని పునఃసృష్టించి చేయాలని డిసైడయ్యారు. తొలుత అతడి పొట్ట, తొడ వద్దగల రక్తనాళాలు, మోచేతి వద్ద కండరాన్ని సేకరించి ల్యాబ్‌లో కృత్రిమంగా పురుషాంగాన్ని సృష్టించారు. ఆ తర్వాత మైక్రోవాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్టెరీ ఫోర్‌ఆర్మ్ ఫ్లాప్ పద్దతిలో తొలుత యువకుడి ముంజేయి వద్ద పురుషాంగాన్ని రూపొందించారు. అనంతరం దానిని రక్తనాళాలకు కనెక్ట్ చేశారు.
ప్రయోగం సక్సెస్ అవ్వడంతో ఏడాదిన్నర కిందట సర్జరీ చేసి దానిని వృషణాల పైభాగంలో దానిని అతికించారు. పురుషాంగం నుంచి యూరిన్ పాస్ చేసేలా గొట్టాన్ని అమర్చి… మూత్రాశయానికి కనెక్ట్ చేశారు. ఏడాదిన్నర తర్వాత.. యువకుడు స్పర్శ పొందడంతో అంగస్తంభన కోసం తాజాగా పిలైన్ ఇంప్లాంట్ చేసినట్లు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడా యువకుడు మ్యారేజ్ చేసుకుని.. సంసారం జీవితం సాఫీగా గడపవచ్చని వెల్లడించారు. అయితే అప్పటి ఇన్‌ఫెక్షన్ కారణంగా వీర్యగ్రంథి డ్యామేజ్ అవ్వడంతో.. స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యే చాన్స్ లేదన్నారు. కాగా ఇన్నాళ్లు డిప్రెషన్‌లో ఉన్న ఆ యువకుడు పురుషాంగాన్ని తిరిగి పొందటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు ఎమోషనల్‌గా థ్యాంక్స్ చెబుతున్నాడు. ‘
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి