అటు…ఎయిర్ పొల్యూషన్‌తో హస్తినలో అస్తవ్యస్థం. ఇటు…దేశవ్యాప్తంగా ఫుడ్ కల్తీతో భయంభయం. నిన్నకాక నిన్న కల్తీ టీపొడి గుట్టలు షాకిచ్చిన వైనం. ఇలా ఎక్కడ చూసినా కల్తీ, కల్తీ, కల్తీ. హే… ఇదంతా నాకొద్దు… హ్యాపీగా మంచినీళ్లు లాగిద్దాం. అదొక్కటే ఆరోగ్య మంత్రం అనుకుంటున్నారా…! అయితే మీరు కూల్ వాటర్‌లో కాలేసినట్లే. ఇప్పుడు ఆ వాటర్‌పైనా కన్నేశారు కంత్రీగాళ్లు. ఫ్రీగా వచ్చే వాటర్‌కి వెలకట్టి బ్రాండ్‌లు తీసుకురావడమే కాదు… అదే బ్రాండ్‌తో బిగ్ ప్రజలకు బ్యాండ్ వేస్తున్నారు.
యస్… పైన ఇమేజ్ చూశారా…! బరాబర్ బిసిలెరీ అనుకున్నారా…! అస్సల్ కానే కాదు… డిటెయిల్డ్‌గా చూడండి… దిమ్మతిరిగిపోవడం పక్కా. ఆ పక్కనే చూడండి…! కాన్ఫిడెంట్‌గా కిన్‌లే అనుకుంటున్నారా…! కాదుకాదు కల్తీగాళ్లు క్రియేట్ చేసిన కెల్వే ఇది. బ్రాండ్ల పేర్లని మార్చి… ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడి వ్యాపారం చేస్తున్నారు. ఇక వీళ్ల కల్తీ సామ్రాజ్యాన్ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.
హైదరాబాద్ అంబర్‌పేట్ పరిధి కాచిగూడలో ఈ కల్తీ వాటర్ దందా యమ హుందాగా సాగుతోంది. బ్రాండ్‌కి అటు ఇటుగా ఒకరో రెండో అక్షరాలు మాత్రం… జనాలకు హెల్త్‌కి బాగా బ్యాండేస్తున్నారు. బయట అమ్మే మినరల్ వాటర్ కంటే డిసాల్డ్ సాలిడ్స్ తక్కువ కలిపి… ఎంచక్కా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు ఈ కేటుగాళ్లు. ఇక పక్కా సమాచారంతో ఈ ఫేక్ కంపెనీపై ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. ప్లాంట్‌కి ప్లాంట్‌నే సీజ్ చేసి పడేశారు. ఈ అక్రమదందాకు పాల్పడుతున్న వారికి అదుపులోకి తీసుకున్నారు. ఇంత తక్కువ టీడీఎస్ ఉన్న వాటర్ తాగితే ప్రమాదాలు వస్తాయని… బ్రాండ్ బాటిల్‌పైనా TDS 75కి మించి ఉంటేనే తాగాలంటున్నారు.
మొత్తంగా…కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితులున్నాయి. కానీ ఆఖరికి వాటర్‌ని కల్తీ చేయడంతో… అసలెవర్రా మీరంతా…? ఎలా బ్రతకాలిరా మేమంతా…? అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..